iDreamPost
android-app
ios-app

టాప్ హీరోస్ సరసన నాని.. ‘సరిపోదా శనివారం’ టార్గెట్​ పెద్దగానే ఉంది!

  • Published Aug 16, 2024 | 2:00 AM Updated Updated Aug 16, 2024 | 2:00 AM

Nani Saripodhaa Sanivaaram Movie Target: న్యాచురల్ స్టార్ నాని మరో కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతన్నాడు. ఆయన నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ త్వరలో విడుదల కానుంది.

Nani Saripodhaa Sanivaaram Movie Target: న్యాచురల్ స్టార్ నాని మరో కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతన్నాడు. ఆయన నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ త్వరలో విడుదల కానుంది.

  • Published Aug 16, 2024 | 2:00 AMUpdated Aug 16, 2024 | 2:00 AM
టాప్ హీరోస్ సరసన నాని.. ‘సరిపోదా శనివారం’ టార్గెట్​ పెద్దగానే ఉంది!

న్యాచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో రేంజ్​కు చేరుకున్నాడు. ‘అష్టాచమ్మా’ అనే స్మాల్ మూవీతో కెరీర్​ను స్టార్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో ఒకడిగా హవా చలాయిస్తున్నాడు. అతడికి క్లాస్​తో పాటు మాస్​ ఆడియెన్స్​లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ఇంక యూత్ ఆడియెన్స్ గురించి చెప్పనక్కర్లేదు. నానికి యువతలో హ్యూజ్ ఫ్యాన్​బేస్ ఉంది. న్యాచురల్ యాక్టింగ్​తో అదరగొట్టే నాని సినిమా సినిమాకు చూపించే వేరియేషన్స్, యాక్టింగ్ స్కిల్స్​ను గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ప్రతి మూవీకి అన్నింటా మెరుగవుతూ పోతున్న ఈ హీరో.. త్వరలో ‘సరిపోదా శనివారం’తో ఆడియెన్స్​ను పలకరించనున్నాడు. ఈ మూవీ జస్ట్ హిట్టయితే సరిపోదు. దీని ముందు బిగ్ టార్గెట్ ఉంది.

వరుస హిట్స్​తో టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్ స్థాయికి చేరుకున్న నాని ముందు ఇప్పుడు పెద్ద లక్ష్యం ఉంది. అదే టైర్-1 హీరోల సరసన చోటు దక్కించుకోవడం. గతేడాది వచ్చిన ‘దసరా’తోనే ఈ టార్గెట్​ను అచీవ్ అవ్వాలని గట్టిగా ప్రయత్నించాడు న్యాచురల్ స్టార్. ఈ ఫిల్మ్​కు వచ్చిన ఓపెనింగ్స్ చూసి టాలీవుడ్ షాక్ అయింది. ఒక మిడ్ రేంజ్ హీరో చిత్రానికి ఇంత భారీ ఓపెనింగ్స్ ఎప్పుడూ రాకపోవడమే దీనికి కారణం. మిక్స్​డ్ టాక్ రావడం వల్ల ఆంధ్రా, సీడెడ్​లో లాంగ్ రన్ సాధ్యం కాలేదు. ఒకవేళ అది పాజిబుల్ అయితే సినిమా లెక్కలు వేరే లెవల్​లో ఉండేవి. ‘దసరా’తో మిస్ అయిన టైర్-1 డ్రీమ్​ను ‘సరిపోదా శనివారం’తో అందుకోవాలని నాని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈసారి బాక్సాఫీస్​ను షేక్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు.

nani new movie

‘సరిపోదా శనివారం’ నుంచి బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్స్​కు సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. మూవీ స్టోరీ లైన్ కూడా ఇంప్రెసివ్​గా ఉంది. ట్రైలర్​ భారీ వ్యూస్​తో యూట్యూబ్​ను ఊపేస్తోంది. దీంతో పాజిటివ్ టాక్ వస్తే బొమ్మ పక్కా హిట్ అని అంటున్నారు. అయితే ఈ మూవీ ముందు దాని కంటే పెద్ద లక్ష్యమే ఉంది. ‘సరిపోదా శనివారం’ 100 కోట్ల పైచిలుకు షేర్ సాధిస్తే నాని టైర్-1లోకి చేరడం ఖాయమని ట్రేడ్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. రిలీజ్ టైమింగ్ బాగుంది, సినిమా నుంచి వచ్చిన కంటెంట్​కు మంచి అప్లాజ్ రావడం, ఎక్స్​పెక్టేషన్స్ పెరిగిన నేపథ్యంలో మూవీ బాగుంటే ఊహించని రేంజ్​లో వసూళ్లు ఉంటాయి. అప్పుడు మిడ్ రేంజ్ నుంచి టాప్ హీరోస్ రేంజ్​కు నాని ఎదిగిపోవడం ఖాయం. మరి.. ‘సరిపోదా శనివారం’తో నాని తన కలను నెరవేర్చుకుంటాడా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.