iDreamPost
android-app
ios-app

Nandamuri Balakrishna: ఊర మాస్ కాంబినేషన్​లో నాలుగో సినిమా అనౌన్స్​మెంట్?

  • Published Mar 14, 2024 | 9:38 PM Updated Updated Mar 14, 2024 | 9:38 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఊర మాస్ కాంబోలో వచ్చే ఈ మూవీ అనౌన్స్​మెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఊర మాస్ కాంబోలో వచ్చే ఈ మూవీ అనౌన్స్​మెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

  • Published Mar 14, 2024 | 9:38 PMUpdated Mar 14, 2024 | 9:38 PM
Nandamuri Balakrishna: ఊర మాస్ కాంబినేషన్​లో నాలుగో సినిమా అనౌన్స్​మెంట్?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్ ‘NBK 109’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన గ్లింప్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తరువాత బాలయ్య చేయబోయే ఫిల్మ్​పై ఎన్నో పుకార్లు వచ్చాయి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సహా మరికొందరి పేర్లు వినిపించినా.. బాలయ్య మాత్రం తనకు హ్యాట్రిక్ హిట్లు అందించిన బోయపాటి శ్రీను వైపు మొగ్గు చూపుతున్నారట. దాంతో ఈ ఊర మాస్ కాంబోలో నాలుగో సినిమా రావడం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తోంది.

ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమా గురించి ప్రకటన రావొచ్చని గట్టిగా టాక్ వినిపిస్తోంది. గతంలో బోయపాటి శ్రీను బాలకృష్ణతో కలిసి చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయి. మూడింటికి మూడు కూడా మాస్ సినిమాలే అయినా బాలయ్యని అభిమానులతో పాటు ప్రేక్షకులకి కూడా నచ్చేలా తెర పై అద్భుతంగా ప్రెజెంట్ చేశారు బోయపాటి శ్రీను. 2010లో విడుదలయిన ‘సింహా’ బాలకృష్ణకు కమ్ బ్యాక్ హిట్​గా నిలిచింది. ఆ తర్వాత 2014లో విడుదలైన ‘లెజెండ్’ కూడా బ్లాక్​బస్టర్ హిట్టయ్యింది. ఇక 2021లో వచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్​లోనే బిగ్గెస్ట్ బ్లాక్​బస్టర్ హిట్ అయి అందరినీ అలరించింది. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలకృష్ణ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్​కు తోడు బాలయ్య ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ‘అఖండ’ సినిమా ప్రేక్షకులని విపరీతంగా అలరించింది.

‘అఖండ’ సీక్వెల్ కోసం గీతా ఆర్ట్స్ ఈ కాంబోలో సినిమా చేస్తుందనే పుకార్లు కొంతకాలంగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్​కు సంబంధించిన ప్రకటన వస్తుందని అంటున్నారు. మరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్​లో వస్తున్న నాలుగో సినిమా ‘అఖండ’ సెకండ్ పార్ట్​గానే ఉంటుందా? లేక వేరే కొత్త సినిమా ఉంటుందా? అనేది చూడాలి. ఈ క్రేజీ కాంబో మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş