iDreamPost
android-app
ios-app

నచ్చావులే మూవీలో హీరో తల్లిగా నటించిన ఆమె.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలుసా..?

స్పెషల్ అండ్ ఐటమ్ సాంగ్స్‌తో మెప్పించి..వెండితెరపై నటీమణులుగా కూడా రాణించవచ్చునని జయమాలిని దగ్గర నుండి నేటి నోరా ఫతేహీ వరకు నిరూపిస్తూనే ఉన్నారు. కేవలం ఐటం బాంబ్స్ మాత్రమే కాదు నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడితే తమను తాము ప్రూవ్ చేసుకోవచ్చునని నిరూపించారు.. వారిలో ఒకరు..

స్పెషల్ అండ్ ఐటమ్ సాంగ్స్‌తో మెప్పించి..వెండితెరపై నటీమణులుగా కూడా రాణించవచ్చునని జయమాలిని దగ్గర నుండి నేటి నోరా ఫతేహీ వరకు నిరూపిస్తూనే ఉన్నారు. కేవలం ఐటం బాంబ్స్ మాత్రమే కాదు నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడితే తమను తాము ప్రూవ్ చేసుకోవచ్చునని నిరూపించారు.. వారిలో ఒకరు..

నచ్చావులే మూవీలో హీరో తల్లిగా నటించిన ఆమె.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో వర్సటైల్ డైరెక్టర్లలో ఒకరు రవిబాబు. అతడి వర్కింగ్ స్టైల్, కామెడీ టైమింగ్, క్యారెక్టర్స్ డిజైనింగ్ మిగిలిన డైరెక్టర్లతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సాంగ్స్‌లో ఎంచుకునే థీమ్ దగ్గర నుండి సపోర్టింగ్ క్యారెక్టర్ల డ్రెస్సింగ్ స్టైల్ వరకు ఆయన వర్క్ విభిన్నంగా ఉంటుంది. ఇక ఎక్కువగా అ, ఆలతో ఎక్కువ సినిమాలు తెరకెక్కించాడు. ఆయన ఇంచు మించు 16 సినిమాలు తెరకెక్కిస్తే.. అందులో ఈ అ, ఆలతో మొదలైనవి ఇంచుమించు తొమ్మది సినిమాలున్నాయి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సక్సెస్ అందుకున్నాడు. క్రైమ్, హారర్, అండ్ యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ అండ్ కామెడీ చిత్రాలను తెరకెక్కించాడు రవిబాబు.

అలాంటి చిత్రాల్లో ఒకటి నచ్చావులే. చైల్డ్ ఆర్టిస్ట్ తనీష్, మాధవీలత హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. 2008లో వచ్చిన ఈ సినిమా ఆ ఏడాది సూపర్ హిట్ మూవీగా నిలిచింది. మంచి వసూళ్లను అందుకుంది.  ఇక ఇందులో సాంగ్స్ చెప్పనక్కర్లేదు ‘నిన్నే నిన్నే కోరా’ ‘మన్నించవా..మాటడవా’ ‘ఏవేవో ఏవో ఏవేవోవో చేస్తూ ఉన్నా’ ‘పావు తక్కువైంది పద్మావతి’ సాంగ్స్ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్ తండ్రిగా నటించారు. అలాగే తల్లి పాత్రలో నటించిన ఆమె ఎవరంటే రాణి. ఈ పేరు తెలియకపోవచ్చు కానీ రక్ష అంటే గుర్తు పట్టేస్తారు. సినిమాల కోసం రాణి రక్షగా మారింది. రక్ష బాల నటిగా అలరించింది. పోలీస్ వెంకట స్వామి అనే చిత్రంలో యాక్ట్ చేసింది ఈ నటి.

మలయాళ ఇండస్ట్రీలో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. చిరునవ్వుల వరమిస్తామా (ఇందులో హీరో విక్రమ్) మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ క్లిక్ కాలేకపోయింది. ఇక చేసేది ఏమీ లేక..ఐటమ్ గార్ల్‌గా మారిపోయింది. ప్రేమలేఖ మూవీలో చిన్నదానా ఓసి చిన్నదానా సాంగ్‌తో అందరికీ సుపరిచితమైన రక్ష.. మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. సినిమాల మీద ఆసక్తితో స్పెషల్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కు స్టిక్ అయిపోయింది. తెలుగులో ఓ చిన్నదానా, గోకులంలో సీత, ఉల్టా పల్టా, కొడుకులు, యమజాతకుడు వంటి సినిమాల్లో నటించింది. అలాగే  ఇంద్రలో ఓ పాటలో మెరిసింది.

నచ్చావులే తర్వాత ఆమెకు గుర్తింపునిచ్చిన క్యారెక్టర్.. బంఫర్ ఆఫర్. పూరి జగన్నాథ్ సోదరుడు సాయి రాం శంకర్, బిందు మాధవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఐటం సాంగ్స్ కు స్వస్థి చెప్పి.. నటిగా కొనసాగేందుకు ప్రయత్నించింది. తెలుగు, తమిళ సినిమాలు చేసింది. నిప్పు, రచ్చ, పవిత్ర, వెన్నెల 1 1/2, గుర్రం ఎగురా వచ్చు, రుద్రమ దేవీ, చిత్రంగద, దువ్వాడ జగన్నాథమ్ వంటి మూవీల్లో కనిపించింది. ప్రస్తుతం తమిళ బుల్లితెరపై నటిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆమె స్పెషల్ సాంగ్స్ వస్తున్నాయంటే యువత పిచ్చేక్కిపోయేవాళ్లు. అలాంటి నటి ఇప్పుడు వెండితెరపై కనిపించకుండా పోయింది. 300 సినిమాలు చేసినా నటిగా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు.