iDreamPost
android-app
ios-app

“నా సామి రంగా”లో అల్లరోడు! ఇంట్రస్టింగ్ అప్డేట్!

  • Published Dec 14, 2023 | 2:18 PM Updated Updated Dec 14, 2023 | 2:18 PM

బంగార్రాజు, ఘోస్ట్ మూవీ తర్వాత నాగార్జున నుండి రాబోతున్న చిత్రం నా సామి రంగా. ఈ మూవీ మలయాళ రీమేక్ అని గట్టిగా వినబడుతోంది. ఈ సంక్రాంతి రేసులో ఈ చిత్రం కూడా ఉండనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రమోషన్లను షురూ చేస్తోంది.

బంగార్రాజు, ఘోస్ట్ మూవీ తర్వాత నాగార్జున నుండి రాబోతున్న చిత్రం నా సామి రంగా. ఈ మూవీ మలయాళ రీమేక్ అని గట్టిగా వినబడుతోంది. ఈ సంక్రాంతి రేసులో ఈ చిత్రం కూడా ఉండనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రమోషన్లను షురూ చేస్తోంది.

  • Published Dec 14, 2023 | 2:18 PMUpdated Dec 14, 2023 | 2:18 PM
“నా సామి రంగా”లో అల్లరోడు! ఇంట్రస్టింగ్ అప్డేట్!

ఈ సంక్రాంతి బరిలో దూకుడుగా వస్తోన్న మూవీ నా సామి రంగా. నాగార్జున, అమిగోస్ బ్యూటీ ఆశిక రంగనాథ్, జైలర్ భామ మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2019లో రిలీజ్ అయిన మలయాళ మూవీ ’పోరింజు మరియం జోస్‘కు రీమేక్ అని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు. చిట్టూరి శ్రీను, పవన్ కుమార్ నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో మాసీ లుక్స్ లో కనిపిస్తున్నారు మన్మధుడు నాగార్జున. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను షురూ చేసేసింది. ఇటీవల నా సామి రంగా నుండి ఫస్ట్ సింగిల్ బయటకు వచ్చింది. చంద్రబోస్ రాసిన ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తోందే పిల్లా’ అనే పాట విడుదలై.. మంచి రెస్పాన్స్ అందుకుంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సాంగ్ చూసేందుకు చాలా కలర్ ఫుల్‌గా ఉంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్స్ కూడా సినిమాతో క్యూరియాసిటినీ పెంచేస్తున్నాయి. ఇప్పుడు మరో కీలక పాత్రను పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఈ మూవీలో నరేష్, రాజ్ తరుణ్ కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపించింది. వాటిని నిజం చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది. అంజిగాడు వస్తున్నాడు.. అంటూ అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేశారు. అంజి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ఈ నెల 15వ తేదీ ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు చిత్ర యూనిట్. అల్లరోడి పాత్రను పరిచయం చేయబోతున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. పక్కా పల్లెటూరి పాత్రలో కనిపిస్తున్నాడు అల్లరి నరేష్.

మెడలో పొట్టకాయలు, కళ్లకు జోడు, గళ్ల చొక్కా,లోపల బన్నీను, లుంగీతో ఫఖ్తు ఊరి కుర్రాడిలా ఉన్నాడు. ఈ పోస్టర్ పై కూడా ఆసక్తిని కలిగించేలా. ‘మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం. లేకుంటే మాటొచ్చేత్తది’ అంటూ గోదారోళ్ల భాషలో రాసి ఉంది. ఆ పోస్టర్ చూస్తుంటే అందమైన పల్లెటూరి వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ లుక్స్ చూస్తే.. నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా చేస్తూనే.. ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్లతో కనిపిస్తున్నాడు మన అల్లరోడు. ఇప్పుడు నా సామి రంగా మూవీలో ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్‌లో గిలిగింతలు పెట్టేందుకు వచ్చేస్తున్నాడు. మరీ అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలపండే ఆయ్.. ఏమంటారు..

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetdamabet girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom