iDreamPost
android-app
ios-app

సినీ ఇండస్ట్రీలో విషాదం…సంగీత దర్శకుడు కన్నుమూత!

Vijay Anand: ఇటీవల కాలం సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో మరణిస్తున్నారు. ఇలా ప్రముఖలు అకాల మరణంతో వారి కుటుంబతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.

Vijay Anand: ఇటీవల కాలం సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో మరణిస్తున్నారు. ఇలా ప్రముఖలు అకాల మరణంతో వారి కుటుంబతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.

సినీ ఇండస్ట్రీలో విషాదం…సంగీత దర్శకుడు కన్నుమూత!

మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుందో ఎవ్వరం చెప్పలేము. మృత్యువుకు ధనిక, పేద అనే బేధం లేదు. అందుకే ఎవరి సమయం వస్తే వాళ్లు వెళ్లిపోతుంటారు. అయితే కొందరి మరణం మాత్రం యావత్త ప్రపంచాన్ని విషాదంలో ముంచుతాయి. అలానే ఇటీవల కాలంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వివిధ కారణాలతో మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశారు.

ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్(71) కన్నుమూశారు. మంగళవారం చెన్నైలోని తన నివాసంలో  మరణించారు. వృద్ధాప్యం కారణంగా సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ మృతి చెందారు. ఆయన మృతి తమిళ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. విసు డైరెక్ట్ చేసిన నాణయం ఇల్లాద నాణయం చిత్రం ద్వారా విజయ్ ఆనంద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘నాన్‌ అడిమై ఇల్లై’ చిత్రం విజయ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ముఖ్యంగా ఆ సినిమాలోని ‘ఒరు జీవన్‌ దాన్‌ ఉన్‌ పాడల్‌దాన్‌..’ సాంగ్ చాలా పాపులర్‌ అయ్యింది. తమిళంలో ‘కొరుక్కు ఉపదేశం’, ‘రాసాతి వరుం నాళ్‌’ తదితర 10 చిత్రాలకు విజయ్ ఆనంద్ పని చేశారు. అలానే ఆనంద్‌ కన్నడంలో కూడా 100కు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించారు. కాగా విజయ్‌ఆనంద్‌ భౌతిక కాయానికి బుధవారం నాడు చైన్నెలో అంత్యక్రియలు జరిగాయి. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత కళకారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  అలానే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మరి.. విజయ్ ఆనంద్ మృతిపై మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.