iDreamPost
android-app
ios-app

దేవర థర్డ్ సింగల్ పై.. అదిరిపోయే అప్ డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే

  • Published Sep 01, 2024 | 4:00 PM Updated Updated Sep 01, 2024 | 4:00 PM

Devara Third Single Update :ఆరేళ్ళ తర్వాత తారక్ నుంచి వస్తున్న సోలో ఫిల్మ్.. దేవర దీనితో అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్.. సినిమాపై అంచనాలను పెంచగా ఇక ఇప్పుడు థర్డ్ సింగల్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Devara Third Single Update :ఆరేళ్ళ తర్వాత తారక్ నుంచి వస్తున్న సోలో ఫిల్మ్.. దేవర దీనితో అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్.. సినిమాపై అంచనాలను పెంచగా ఇక ఇప్పుడు థర్డ్ సింగల్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 01, 2024 | 4:00 PMUpdated Sep 01, 2024 | 4:00 PM
దేవర థర్డ్ సింగల్ పై.. అదిరిపోయే అప్ డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే

కొరటాల శివ తారక్ కాంబినేషన్ లో రాబోతున్న దేవర మూవీకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ఈలోపు ఎలాంటి అప్ డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసేశాయి. రిలీజ్ కు ముందు వచ్చిన అప్ డేట్స్ తోనే.. మిలియన్ వ్యూస్ తో సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. ఇక ఇప్పుడు థర్డ్ సింగల్ కు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ను అందించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేవర సినిమాకు అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమాలోని సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్స్ కు అదిరిపోయే రికార్డ్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత సినిమాలోని అతి ముఖ్యమైన ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ కూడా వినిపించింది. కానీ తాజాగా థర్డ్ సింగల్ కు సంబంధించిన విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు అనిరుధ్. దావుడి పేరుతో మూడో సాంగ్ ఉండనుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లు ఈ పాటలో అదరగొట్టనున్నారు అన్నట్లుగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. దీనితో ఈ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు. అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.

ఇక దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఒకవేళ అనుకున్నంత రేంజ్ లో ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ..దేవర సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను బ్రేక్ చేయడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఈ ఏడాది వచ్చిన భారీ అంచనాలతో రిలీజ్ అయినా స్టార్ హీరోల సినిమాలలో కల్కి కాకుండా మిగిలినవేమి కూడా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయాయి. కాబట్టి ఈ సినిమా క్రియేట్ చేయబోయే రికార్డ్స్ పై.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా క్రేజ్ రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasinomarsbahis giriş