Chiranjeevi
టాలీవుడ్ కు ఈ ఏడాది తొలి ఆరు నెలలు గడచిపోయాయి. చాలా సినిమాలు వచ్చాయి.వెళ్లాయి. ఎన్ని గుర్తున్నాయి అంటే మహా అయితే మూడు నాలుగు.
టాలీవుడ్ కు ఈ ఏడాది తొలి ఆరు నెలలు గడచిపోయాయి. చాలా సినిమాలు వచ్చాయి.వెళ్లాయి. ఎన్ని గుర్తున్నాయి అంటే మహా అయితే మూడు నాలుగు.
Chiranjeevi
టాలీవుడ్ కు ఈ ఏడాది తొలి ఆరు నెలలు గడచిపోయాయి. చాలా సినిమాలు వచ్చాయి.వెళ్లాయి. ఎన్ని గుర్తున్నాయి అంటే మహా అయితే మూడు నాలుగు. నిర్మాతలను హ్యాపీగా వుంచినవి ఎన్ని అంటే మహా అయితే రెండు మూడు. ప్రతి సినిమా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. పబ్లిసిటీ భారీగా చేస్తున్నారు. హీరోలు,దర్శకులు అలుపు లేకుండా ఇంటర్వూలు ఇస్తున్నారు. జనం ముందుకు వెళ్తున్నారు. లక్షలు ఖర్చు చేసి ఫంక్షన్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడా లోపం వుడడం లేదు. కానీ సినిమాలకు టికెట్ లు పెద్దగా తెగడం లేదు.
ఎందుకు..ఎందుకు..ఎందుకు…కామన్ గా దొరికే సమాధానాలు రెండు. కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగుంటే జనాలు వస్తారు. కంటెంట్ బాగా లేకుండా ఎంత హడావుడి చేస్తే ఏముంది అనే సమాధానం ఒకటి. టికెట్ రేట్లు భారం అనేది మరో సమాధానం. ఎంత చిన్న సినిమా అయినా నూట యాభై నుంచి నూట డెభై పెట్టకుంటే వెళ్లడం కుదరదు. అందువల్ల జనం ఓటిటి వైపే మొగ్గు చూపుతున్నారు.
మరి టికెట్ రేట్లు భారం అనుకుంటే కొన్ని సినిమాలను ఎందుకు ఆదరిస్తున్నారు. అంటే మళ్లీ ఫస్ట్ పాయింట్ కు రావాలి. కంటెంట్ బాగుంటే రేటు తో సంబంధం లేదు అని. ఇప్పుడు మరో ప్రశ్న రెడీ అవుతుంది. కంటెంట్ బాగుండడం అంటే ఏ కంటెంట్ జనాలకు నచ్చుతుంది. ఏది నచ్చదు?
ఇది అస్సలు ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్న. ప్రపంచ సినిమా పరిచయం అయిపోయిన తరువాత మన ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుంది..ఏ సినిమా నచ్చదు అన్నది అస్సలు జవాబు కనిపెట్టలేని ప్రశ్న. ఈ సబ్జెక్ట్ బాగుంది. సరైన కాస్టింగ్ సెట్ అయింది. బాగా వచ్చింది. జనానికి నచ్చుతుంది అని బ్లయిండ్ గా ముందుకు వెళ్లిపోవడమే.
ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్నది అదే. వీలయినంత వరకు సరైన సబ్జెక్ట్ ను, సరైన కాస్టింగ్ ను తీసుకుని, అందిస్తున్నారు. కానీ ఇక్కడే చిన్న తేడా జరుగుతోంది. నిర్మాత పాత్ర సరైన సబ్జెక్ట్ ఎంచుకోవడం, సరైన కాస్టింగ్ సెట్ చేయడం, డబ్బుల దగ్గర రాజీపడకుండా ముందుకు వెళ్లడం. కానీ ఆ సబ్జెక్ట్ ను ప్రేక్షకులకు నచ్చేలా అందించాల్సింది దర్శకుడే. అక్కడ తేడా కొడుతోంది.
కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే ఓ సమస్య. ఒకటి రెండు సినిమాలు చేసిన వారికి ఇస్తే మరో సమస్య. నూటికి తొంభై మంది సబ్జెక్ట్ ను సరిగ్గా డీల్ చేయడంలో, సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో, సరిగ్గా ప్రేక్షకులకు నచ్చేలా అందించడంలో ఫెయిల్ అవుతున్నారు. అక్కడ వస్తోంది సమస్య.
ఇటీవల కాలంలో రివ్యూవర్ల నుంచి నూటికి నూరు పాళ్లు అప్రిసియేషన్ పొందిన సినిమా అనేది లేదు. మా ఇంటి బంగారం బాగానే ఆడింది కానీ దానికీ రివ్యూవర్ల నుంచి మద్దతు రాలేదు. ఫ్యామిలీ సినిమాలు కరువైపోవడం, సమంత క్రేజ్ ఇవన్నీ ఆ సినిమాకు ప్లస్ అయ్యాయి. శంకరప్రసాద్ కూడా వింటేజ్ ఫ్యామిలీ సినిమానే. అలా అని మళ్లీ వరుసగా అన్నీ ఇలాంటి సినిమాలే తీస్తూ పోతాం అంటే కుదరదు.
నిజానికి ప్రేక్షకులది తప్పు లేదు..రివ్యూవర్ల మాదిరిగా వాళ్లు కఠినంగా వుండడం లేదు. ఆ మాత్రం ఈమాత్రం బాగుంటే చాలు ఆదరిస్తున్నారు. అందువల్ల రివ్యూలు చంపేస్తున్నాయి అనే వాదన కరెక్ట్ కాదు. రివ్యూలు ఇవ్వకపోయినా మా ఇంటి బంగారం ఆడింది కదా. ఇలాంటి ఉదాహరణలు చాలా వున్నాయి.
నిర్మాతలు 2026 సెకెండాఫ్ బాగుంటుంది అనే ఆశతో వున్నారు. ఎందుకు భారీ, క్రేజీ కాంబినేషన్ సినిమాలు చాలా వున్నాయి కనుక. భారీ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు తప్ప, కంటెంట్ సినిమాలు అని అనడం లేదు. పెద్ద హీరోల సినిమాలు వున్నాయని ఆశ పెట్టుకున్నారు తప్ప, చిన్న సినిమాలు, చిన్న కాంబినేషన్ తో వస్తున్న కంటెంట్ సినిమాల గురించి ఆశ పెట్టుకోవడం లేదు. కానీ జనాలు పెద్ద సినిమాలకు బయటకు వస్తున్నారు కానీ పూర్తిగా నచ్చితేనే నెత్తిన పెట్టుకుంటున్నారు. అలా ఇలా వుంటే పక్కన పడేస్తున్నారు. అదే చిన్న, మీడియం రేంజ్ సినిమాకలకు థియేటర్లకు రావడం లేదు, కానీ వన్స్ ఏమాత్రం బాగుంది అని టాక్ వచ్చినా, బయటకు వచ్చి ఆదరిస్తున్నారు.
అందువల్ల రాబోయే ఆరు నెలల్లో పెద్ద సినిమాలు వస్తాయి. మీడియాలో, సోషల్ మీడియాలో హడావుడి అయితే వుంటుంది. కానీ అంత మాత్రం చేత అద్భుతాలు జరిగిపోతాయని అనుకోవడానికి లేదు. కానీ అదే టైమ్ లో అనేక చిన్న సినిమాలు కూడా నిర్మాణంలో వున్నాయి. వీటి వరకు బయర్లకు రిస్క్ తక్కువ. ఇవి అద్భుతాల చేస్తే టాలీవుడ్ ఓ రేంజ్ లో వుంటుంది.