Chiranjeevi
బౌండ్ స్క్రిప్ట్ రాజీ లేకుండా రెడీ కావాలి..డైలాగ్ వెర్షన్ రెడీ కావాలి. అప్పుడే సెట్ మీదకు వెళ్తారు దర్శకుడు శేఖర్ కమ్ముల.
బౌండ్ స్క్రిప్ట్ రాజీ లేకుండా రెడీ కావాలి..డైలాగ్ వెర్షన్ రెడీ కావాలి. అప్పుడే సెట్ మీదకు వెళ్తారు దర్శకుడు శేఖర్ కమ్ముల.
Chiranjeevi
బౌండ్ స్క్రిప్ట్ రాజీ లేకుండా రెడీ కావాలి..డైలాగ్ వెర్షన్ రెడీ కావాలి. అప్పుడే సెట్ మీదకు వెళ్తారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అది ఆయన పద్దతి. అందుకోసం ఎన్ని ఏళ్ల పట్టినా వేచి వుంటారు. కుబేర సినిమా విడుదలై ఏడాది దాటింది. మళ్లీ సినిమా ఎప్పుడు అన్నది శేఖర్ కమ్ముల అభిమానుల మాట.
తెలుస్తున్న సమచారం ప్రకారం శేఖర్ కమ్ముల తరువాత సినిమా స్క్రిప్ట్ పూర్తయింది. డైలాగ్ వెర్షన్ కూడా రెడీ అయింది. ఎవరు హీరో అన్న విషయంలో కాస్త గోప్యత పాటిస్తున్నారు. ఎవరి డేట్ లు కూడా రెడీగా లేవు. నాని లైన్ లో రెండు సినిమాలు వున్నాయి. చైతన్య తో మళ్లీ వెళ్లే అవకాశం కొంత వరకు వుంది. లేదా మళ్లీ తమిళ యంగ్ హీరో ఎవరితోనైనా వెళ్లాలా అనేది కూడా ఆలోచిస్తున్నారు.
అతి త్వరలో హీరో డేట్ లు లాక్ అయితే సినిమాను అనౌన్స్ చేసే ఆలోచనలో వున్నారు. లవ్ స్టోరీ పెద్ద హిట్ అయింది. కుబేర కు మంచి రివ్యూలు, మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ ఆ మేరకు కమర్షియల్ గా అయితే ఆడలేదు. అందువల్ల ఈసారి స్క్రిప్ట్ విషయంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.