iDreamPost
android-app
ios-app

కీరవాణి కొడుకుతో మురళీ మోహన్ మనవరాలి పెళ్లి.. ముహూర్తం ఫిక్స్!

  • Published Dec 13, 2023 | 4:29 PM Updated Updated Dec 13, 2023 | 4:29 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి సందడి నెలకొంది. వరుణ్ తేజ్-లావణ్య ఒకింటి వారయ్యారు. అటు దగ్గుబాటి ఇంట్లో రెండు శుభకార్యాలు జరిగాయి. రానా తమ్ముడు యంగ్ హీరో అభిరామ్ దగ్గుబాటి వివాహం చేసుకోగా, వెంకటేష్ రెండో తనయ నిశ్చితార్థం జరిగింది. అలాగే యంగ్ హీరో ఆశిష్ ఎంగేజ్ మెంట్ అయ్యింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి సందడి నెలకొంది. వరుణ్ తేజ్-లావణ్య ఒకింటి వారయ్యారు. అటు దగ్గుబాటి ఇంట్లో రెండు శుభకార్యాలు జరిగాయి. రానా తమ్ముడు యంగ్ హీరో అభిరామ్ దగ్గుబాటి వివాహం చేసుకోగా, వెంకటేష్ రెండో తనయ నిశ్చితార్థం జరిగింది. అలాగే యంగ్ హీరో ఆశిష్ ఎంగేజ్ మెంట్ అయ్యింది.

  • Published Dec 13, 2023 | 4:29 PMUpdated Dec 13, 2023 | 4:29 PM
కీరవాణి కొడుకుతో మురళీ మోహన్ మనవరాలి పెళ్లి.. ముహూర్తం ఫిక్స్!

సినిమా ఇండస్ట్రీలో వరుసగా భాజా భంజత్రీలు మోగుతున్నాయి. ఇటీవల పలువురు సినీ సెలబ్రిటీలు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబర్ 1న వివాహం చేసుకున్నారు. ఇటీవలే కోలీవుడ్ హాస్య నటుడు రెడిన్ కింగ్ స్లే.. లేటు వయస్సులో టీవీ నటి సంగీతను మనువాడాడు. ఇక బాలీవుడ్ నటులు కునాల్ ఠాకూర్(కబీర్ సింగ్, యానిమల్) , ముక్తి మోహన్ రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న తనయుడు, యంగ్ హీరో అభిరామ్ కూడా ప్రత్యూష మెడలో మూడు ముళ్లు వేశాడు. అలాగే టాలీవుడ్ మరో అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు, నటుడు ఆశిష్ ఎంగేజ్ మెంట్ జరిగింది.

అయితే ఇదే సమయంలో ఇండస్ట్రీకి చెందిన రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయన్న వార్త హల్ చల్ చేసింది. అదే సీనియర్ నటుడు మురళీ మోహన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుటుంబాలు వియ్యం పొందబోతున్నారని న్యూస్ గుప్పుమంది. మురళీమోహన్ మనవరాలిని, కీరవాణి చిన్న కుమారుడు, నటుడు సింహకు వివాహం నిశ్చయమైందన్న వార్త వినిపించింది. దీనిపై క్లారిటీ ఇచ్చారు మురళీ మోహన్. తన మనవరాలు.. కీరవాణి ఇంటి కోడలు కాబోతుందని స్పష్టతనిచ్చారు ఈ సీనియర్ నటుడు. ఆయన మాట్లాడుతూ ‘నాకు కొడుకు, కూతురు ఉన్నారు. అమ్మాయి విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఆమెకు ఓ కూతురు. 2024లో ఫిబ్రవరి 14లో వివాహం జరగనుంది’ అని చెప్పారు.

అలాగే కొడుకుకు కూడా ఓ కుమార్తె ఉందని, ఆమెకు కూడా పెళ్లి కుదిరిందని చెప్పారు. కీరవాణి చిన్న కుమారుడు సింహకు ఇచ్చి తన మనవరాలి పెళ్లి చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది చివరిలో ఆ వివాహం జరుగుతుందని చెప్పారు. కాగా, ఆ అమ్మాయి పేరు రాగ అని తెలుస్తోంది. మురళీ మోహన్ కుమారుడి పేరు రామ్ మోహన్ రావు. ఆయన కుమార్తె ఈ రాగ. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారట. ఇక సింహ విషయానికి వస్తే.. హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో కనిపించిన ఈ నటుడు.. మత్తు వదలరా మూవీతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ వంటి చిత్రాలతో అలరించాడు. ఇటీవల ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ మరో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఆలపించిన సంగతి విదితమే. ఇక టాలీవుడ్ ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి.. కీరవాణి సోదరుడు అన్న సంగతి విదితమే.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcasinolevant girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom