iDreamPost
android-app
ios-app

టీజర్ తో గేమ్ ఛేంజర్ అసలైన గేమ్ షురూ..

  • Published Nov 08, 2024 | 5:43 PM Updated Updated Nov 08, 2024 | 5:43 PM

Game Changer Teaser Update: గేమ్ చెంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు. ఈ సినిమాకు అసలు మూమెంట్ ఇప్పటినుంచే స్టార్ట్ అవ్వనుంది. ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి మరో లెక్క అనేలా టీజర్ తో గేమ్ ఛేంజర్ మారబోతుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Game Changer Teaser Update: గేమ్ చెంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు. ఈ సినిమాకు అసలు మూమెంట్ ఇప్పటినుంచే స్టార్ట్ అవ్వనుంది. ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి మరో లెక్క అనేలా టీజర్ తో గేమ్ ఛేంజర్ మారబోతుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Nov 08, 2024 | 5:43 PMUpdated Nov 08, 2024 | 5:43 PM
టీజర్ తో గేమ్ ఛేంజర్ అసలైన గేమ్ షురూ..

కొన్నేళ్ల నిరీక్షణకు జనవరి 10 న శుభం కార్డు వేయబోతున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా తపించిపోతున్నారు. ఒక్క ఆర్ఆర్ఆర్ మూవీ రామ్ చరణ్ ఇమేజ్ నే మార్చేసింది. ఈ పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ క్యామియో చేసిన ఆచార్య ప్లాప్ అయింది. అది గెస్ట్ రోల్ కాబట్టి అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ గేమ్ ఛేంజర్ అలా కాదు.. మొత్తం ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నారు. భారం అంతా శంకర్ మీదే వేశారు. శంకర్ కూడా దీని కోసం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు గేమ్ చెంజర్ మీద వచ్చిన టాక్ అంతా ఒక లెక్క.. టీజర్ తర్వాత వచ్చే టాక్ ఒక లెక్క. అనే విధంగా మూవీ టీజర్ ను రెడీ చేస్తున్నాడు.

సో ఇక మీదట గేమ్ ఛేంజర్ గేమ్ మారబోతుందని చెప్పి తీరాల్సిందే. లక్నోలో జరిగే ఈవెంట్ లో గ్రాండ్ గా గేమ్ ఛేంజర్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు చరణ్, శంకర్, ఎస్జె సూర్య, శ్రీకాంత్ తో పాటు సినిమాలో మెయిన్ క్యాస్ట్ అంతా కూడా అటెండ్ కాబోతున్నారు. అయితే ఈలోపే ఈ మూవీ టీజర్ కట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. టీజర్ అంతా 91 సెకండ్లు ఉండబోతుందట. ఎస్ జే సూర్య ఇంట్రోతో మొదలై.. రామ్ చరణ్ ఎలివేషన్ షాట్స్ , ట్రైన్ ఎపిసోడ్ విజువల్స్ , అప్పన్న గెటప్ తాలుకు ఔట్ లుక్ ఇలాంటి సీన్స్ తో రన్ అయ్యి.. లాస్ట్ లో చరణ్ చెప్పే అన్ ప్రిడిక్టబుల్ అనే డైలాగ్ తో ముగుస్తుందని తెలిసింది. ఒక చిన్న డైలాగ్ తప్ప పెద్దగా మాటలు కూడా ఏమి ఉండవట. కానీ ఆ ఎడిటింగ్ చేయించిన తీరు మాత్రం పదే పదే టీజర్ చూసేలా ఉంటుందని సమాచారం.

సో మొత్తానికి ఈ చిన్న టీజర్ గేమ్ మొత్తాన్ని రివర్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అటు నిర్మాత దిల్ రాజు బిజినెస్ డీల్స్ ను కంప్లీట్ గా క్లోజ్ చేయలేదు. టీజర్ వచ్చిన తర్వాత అంచనాలు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఈ కారణంగానే అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్ పై ఇండియన్ 2 తాలూకా ప్రభావం ఉన్నా కూడా.. శంకర్ బ్రాండ్ కంటే కూడా రామ్ చరణ్ మూవీగానే ఇది చలామణి అవుతుంది. సో క్రమంగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతి బరిలో పోటీ చేస్తున్న సినిమాల నుంచి ఫస్ట్ వస్తున్న టీజర్ ఇదే. ఇక ఇది ఎలాంటి రెస్పాన్స్  అందుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.