iDreamPost
android-app
ios-app

కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం

  • Published May 20, 2025 | 3:08 PM Updated Updated May 20, 2025 | 3:08 PM

2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఓ తెలుగు సినిమా మ‌న ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ (M4M - Motive for Murder). కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్‌లో ‘ఎం4ఎం’ మూవీ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది.

2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఓ తెలుగు సినిమా మ‌న ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ (M4M - Motive for Murder). కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్‌లో ‘ఎం4ఎం’ మూవీ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది.

  • Published May 20, 2025 | 3:08 PMUpdated May 20, 2025 | 3:08 PM
కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం

Cannes 2025 : కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం

▪ ప్రపంచ ప్రీమియర్‌తో చరిత్ర సృష్టించిన ‘M4M’
▪ తెలుగు సినిమాకు కేన్స్‌లో దక్కిన అరుదైన ఘనత
▪ మోహన్ వడ్లపట్ల, జో శర్మ రెడ్ కార్పెట్‌పై మెరిశారు
▪ అభినందనలు తెలిపిన సినీ దిగ్గజాలు

2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఓ తెలుగు సినిమా మ‌న ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ (M4M – Motive for Murder). కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్‌లో ‘ఎం4ఎం’ మూవీ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

తెలుగు చిత్రసీమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్లతో పాటు అమెరికాకు చెందిన నటి జో శర్మ గౌరవంగా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు హర్షధ్వానాలు చేయడంతో పాటు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇది తెలుగు సినిమాకు కేన్స్‌లో దక్కిన అరుదైన ఘనత.

ఇటీవల అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందుతున్న జో శర్మ, ఈ ఈవెంట్‌లో దుబాయ్, ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, నటనా ప్రతిభకు అక్కడి మీడియా ప్రశంసలు కురిపించింది.

మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్‌విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన M4M, కేన్స్ 2025లో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథన బలంతో పాటు సినిమాటిక్ ప్రెజెంటేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌ సహా ప్రపంచ సినీ పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు హాజరై చిత్రానికి అభినందనలు తెలిపారు.

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకు కేన్స్‌లో ఊరిస్తున్న ఈ అరుదైన గౌర‌వం, M4M మూవీకి ద‌క్క‌డంతో ఈ ప్రీమియర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో గొప్ప ఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాతగా మంచి గుర్తింపు ఉన్న‌ మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జో శర్మ అభినయం ప్రపంచ స్థాయిలో ప్రశంసలందుకుంది.

త్వరలో ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. భారతీయ ప్రాంతీయ సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన సినిమాగా M4M విడుద‌ల‌కు ముందే అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప్ర‌శంస‌లు అందుకుంటోంది.