iDreamPost
android-app
ios-app

మెగా కాంపౌండ్ లో డిజాస్టర్స్ పర్వం! బ్రేక్ పడేది ఎప్పుడు?

మెగా కాంపౌండ్‌ నుంచి వస్తున్న సినిమాలు వరుసగా ప్లాపులు అవుతూ వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. మరి, మెగా హీరోల సినిమాల ప్లాపుల పర్వానికి బ్రేక్‌ పడేది ఎప్పుడు?...

మెగా కాంపౌండ్‌ నుంచి వస్తున్న సినిమాలు వరుసగా ప్లాపులు అవుతూ వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. మరి, మెగా హీరోల సినిమాల ప్లాపుల పర్వానికి బ్రేక్‌ పడేది ఎప్పుడు?...

మెగా కాంపౌండ్ లో డిజాస్టర్స్ పర్వం! బ్రేక్ పడేది ఎప్పుడు?

ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ప్రతీ ఏటా పదుల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నాయి. గత కొంత కాలం నుంచి మెగా హీరోలను వరుస ప్లాపులు చుట్టు ముడుతున్నాయి. నెలల కాలంలో ముగ్గురు హీరోల సినిమాలు ప్లాప్‌ అయ్యాయి. మెగా కాంపౌండ్‌లో కొనసాగుతున్న ఈ డిజాస్టర్స్‌ పర్వంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు.

ముగ్గురు హీరోలు.. మూడు ప్లాపులు.. 

భోళా శంకర్‌: మెగాస్టార్‌ చిరంజీవి ‘ భోళా శంకర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు మెహర్‌ రమేష్‌ దర్శకుడిగా దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళంలో అజిత్‌ హీరోగా వచ్చిన ‘వేదాలం’ సినిమా తెలుగు రీమేకే ఈ ‘భోళా శంకర్‌’. తమిళ్‌లో హిట్‌గా నిలిచిన ఈ కథ.. తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భోళా శంకర్‌ అట్టర్‌ ప్లాప్‌ అయింది.

 గాంఢీవ ధారి అర్జున : మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ పెదనాన్ని సినిమా ‘భోళా శంకర్‌’ విడుదలైన కొన్ని రోజులకే తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గాంఢీవ ధారి అర్జున ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్‌ ప్యాక్‌డ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహించారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. భాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. సినిమాకు నెగిటివ్‌ రావటంతో సరైనా కలెక్షన్లు రాలేదు. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ వరుసగా రెండో వైఫల్యాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఆది కేశవ : మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తాజాగా ‘ఆదికేశవ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం నవంబర్‌ 24వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. మాస్‌ మసాలా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎన్‌ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీలీల .. వైష్ణవ్‌ తేజ్‌ సరసన నటించారు. అయితే, ఈ సినిమాకు మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి.

ఆందోళనలో మెగా ఫ్యాన్స్‌ 

మెగా కాంపౌండ్‌ నుంచి వస్తున్న సినిమాలు వరుస ప్లాపులుగా నిలుస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత రాబోయే సినిమాలపైనే అన్ని ఆశలు పెట్టుకుని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ హీరోలు చేస్తున్న భారీ ప్రాజెక్టులతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ పడుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. మరి, మెగా కాంపౌండ్ లో కొనసాగుతున్న డిజాస్టర్స్ పర్వంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.