iDreamPost
android-app
ios-app

మెగా సెలబ్రేషన్స్​లో మంచు లక్ష్మి సందడి!

  • Author singhj Published - 04:42 PM, Tue - 14 November 23

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్​ అదిరిపోయాయి. ఈ వేడుకల్లో మంచు లక్ష్మి కూడా పాల్గొని సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్​లో ఆమెకు సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్​గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్​ అదిరిపోయాయి. ఈ వేడుకల్లో మంచు లక్ష్మి కూడా పాల్గొని సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్​లో ఆమెకు సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్​గా మారింది.

  • Author singhj Published - 04:42 PM, Tue - 14 November 23
మెగా సెలబ్రేషన్స్​లో మంచు లక్ష్మి సందడి!

మంచు లక్ష్మి.. టాలీవుడ్​లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో ఆమె ఒకరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందామె. కానీ వరుస సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్​లతో నటిగా తనకుంటూ సొంత గుర్తింపును సంపాదించింది. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీలో ఐరేంద్రి అనే విలన్ క్యారెక్టర్​లో నటించి అందర్నీ భయపెట్టారు లక్ష్మి. అనంతరం ‘దొంగల ముఠా’, ‘డిపార్ట్​మెంట్’, ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా?’, ‘గుండెల్లో గోదారి’, ‘దూసుకెళ్తా’, ‘చందమామ కథలు’ లాంటి చిత్రాల్లో నటించారు. ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’ లాంటి అవార్డు విన్నింగ్ ఫిల్మ్స్ తర్వాత ఎందుకో గానీ ఆమె సినిమాలు తగ్గించారు. తెలుగు సినిమాల కంటే ముందు ‘ది ఓడ్’, ‘డియర్ ఎయిర్’ అనే ఇంగ్లీష్ మూవీస్​లోనూ యాక్ట్ చేశారామె.

మంచు లక్ష్మి విలన్​గా యాక్ట్ చేసిన ‘అనగనగా ఓ ధీరుడు’తో పాటు కీలక పాత్ర పోషించిన ‘చందమామ కథలు’లో నటనకు గానూ నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. మూవీస్​తో పాటు ఒకే టైమ్​లో టెలివిజన్ షోస్ చేస్తూ చాలా బిజీ అయ్యారామె. ‘ప్రేమతో మీ లక్ష్మి’, ‘లక్కుంటే లక్ష్మి’, ‘లక్ష్మి టాక్ షో’, ‘ఆహా భోజనంబు’ లాంటి టాక్ షోస్​కు ఆమె హోస్ట్​గా వ్యవహరించారు. టెలివిజన్ షోస్ చేస్తున్నప్పటికీ ఆమె ఎక్కువగా ఫిల్మ్స్ చేయడం లేదు. మూవీ ఆఫర్స్ విషయంలో చాలా సెలెక్టివ్​గా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిట్​నెస్​ విషయంలో మాత్రం ఆమె తగ్గేదేలే అనేలా ఉంటారు. ఫిట్​గా ఉండేందుకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారీ మంచు వారమ్మాయి. స్టార్ హీరోయిన్ సమంతతో కలసి ఫిట్​నెస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను అప్పుడప్పుడు నెటిజన్స్​తో ఆమె షేర్ చేసుకోవడం చూసే ఉంటారు. ఇక, దీపావళి సందర్భంగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారు.

మెగా పార్టీకి టాప్ స్టార్స్ తమ ఫ్యామిలీస్​తో అటెండ్ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్​తో పాటు పలువురు దివాళీ పార్టీలో సందడి చేశారు. మెగా ఇంటి ఈవెంట్​కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వేడుకలకు మంచు లక్ష్మి కూడా హాజరయ్యారు. సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ వేసుకొని స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారామె. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను తాజాగా లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆమెకు హీరో అల్లు శిరీష్ కిస్ పెడుతూ కనిపించారు. లక్షిని శిరీష్ కిస్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్​చల్​గా మారాయి. కాగా, ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో మంచి హిట్ కొట్టారు అల్లు శిరీష్. కానీ హిట్ పడినా ఆ తర్వాత తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. మరి.. మంచు లక్ష్మి-అల్లు శిరీష్ కిస్ ఉదంతంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చిరంజీవితో మూవీ ఛాన్స్ వస్తే.. రిజెక్ట్ చేస్తా: పొలిమేర డైరెక్టర్!

 

View this post on Instagram

 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişacerbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom