iDreamPost
android-app
ios-app

చిరంజీవితో మూవీ ఛాన్స్ వస్తే.. రిజెక్ట్ చేస్తా: పొలిమేర డైరెక్టర్!

  • Author Soma Sekhar Published - 03:31 PM, Tue - 14 November 23

పొలిమేర 2 డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు చిరంజీవితో మూవీ తీసే ఛాన్స్ వచ్చినా గానీ రిజెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ యంగ్ డైరెక్టర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం.

పొలిమేర 2 డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు చిరంజీవితో మూవీ తీసే ఛాన్స్ వచ్చినా గానీ రిజెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ యంగ్ డైరెక్టర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 03:31 PM, Tue - 14 November 23
చిరంజీవితో మూవీ ఛాన్స్ వస్తే.. రిజెక్ట్ చేస్తా: పొలిమేర డైరెక్టర్!

‘మా ఊరి పొలిమేర’ కరోనా సమయంలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించడంతో.. దీని సీక్వెల్ ‘పొలిమేర 2’ ను భారీ స్థాయిలో తెరకెక్కించాడు డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్. నవంబర్ 3 వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ కు చెందిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. పొలిమేర 2తో కమర్షియల్ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా చిరూతో మూవీ ఛాన్స్ వచ్చినా గానీ చేయనని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్.. ప్రస్తుతం ఇండస్ట్రీ మెుత్తం అతడివైపే చూస్తోంది. పొలిమేర, పొలిమేర 2 లాంటి చిత్రాలతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన పొలిమేర 2 చిత్రం భారీ విజయాన్ని అందుకుని.. థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ మూవీలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ లో అవకాశం వస్తే.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో మంది డైరెక్టర్లకు కోరికగా ఉంటుంది. అదో పెద్ద అచీవ్ మెంట్ గా సదరు డైరెక్టర్లు భావిస్తారు. కానీ తనకు మాత్రం చిరూతో మూవీ ఛాన్స్ వస్తే మాత్రం రిజెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు పొలిమేర దర్శకుడు. దానికి ఓ బలమైన కారణం కూడా చెప్పుకొచ్చాడు అనిల్ విశ్వనాథ్.

” నేను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ ని. నాకంటే ఆయనను అభిమానించే వారు మరోకరు ఉండరేమో. ఇక నేను చేసిన సినిమా చూసి.. ఆయన అభినందిస్తే చాలు. అదే నాకు అవార్డు, రివార్డు. భవిష్యత్ లో పొలిమేర కంటే మంచి సినిమా తీస్తా, అప్పుడు నన్ను చిరూ గ్యారంటీగా పిలిపించుకుని మాట్లాడతారు అనే నమ్మకం ఉంది. కానీ మెగాస్టార్ తో సినిమా ఛాన్స్ వస్తే మాత్రం నేను రిజెక్ట్ చేస్తా. డైరెక్టర్ అనే వాడు షూటింగ్ లో ఏది బాగుందో? ఏది బాగోలేదో? చెప్పాలి. చిరు వీరాభిమానిగా ఆయన ఏం చేసినా నాకు బాగానే ఉంటుంది. కాబట్టి నాకు ఆయన అవకాశం ఇచ్చినా.. మూవీ చేయలేనని చెబుతాను” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక మెగాస్టార్ నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను 70 సార్లు చూశానని తెలిపాడు అనిల్. మరి చిరుతో సినిమా ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తానన్న పొలిమేర డైరెక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş