iDreamPost
android-app
ios-app

స్నేహం కోసం రామ్ చరణ్ ఇంత చేస్తాడా? నిమిషంలో రూ.5 లక్షలు! మనోజ్ బయటపెట్టిన నిజం!

  • Published Mar 28, 2024 | 10:50 AM Updated Updated Mar 28, 2024 | 10:50 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా అండ్ మంచు కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. అయితే మెగా స్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు మధ్య వైరం ఉందని భావిస్తుంటారు. తాజాగా దీని గురించి, రామ్ చరణ్ స్నేహం గురించి చెప్పాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా అండ్ మంచు కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. అయితే మెగా స్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు మధ్య వైరం ఉందని భావిస్తుంటారు. తాజాగా దీని గురించి, రామ్ చరణ్ స్నేహం గురించి చెప్పాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

  • Published Mar 28, 2024 | 10:50 AMUpdated Mar 28, 2024 | 10:50 AM
స్నేహం కోసం రామ్ చరణ్ ఇంత చేస్తాడా? నిమిషంలో రూ.5 లక్షలు! మనోజ్ బయటపెట్టిన నిజం!

తెలుగు ఇండస్ట్రీలో ఉప్పు-నిప్పుగా ఉంటాయి మెగా అండ్ మంచు ఫ్యామిలీ అన్న అపవాదు ఉంది. మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మధ్య అగ్గి వేస్తే రాజుకుంటుందన్న రూమర్లు వస్తుంటాయి. అయితే వీరి కుమారులు మాత్రం మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి విదితమే. ముఖ్యంగా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్, చిరు ముద్దుల తనయుడు రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్. తమ బాండింగ్ గురించి, రామ్ చరణ్ గొప్పతనం, మంచి మనస్సు గురించి తాజాగా నిజాలు బయట పెట్టాడు మంచు మనోజ్. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు రామ్ చరణ్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. చెర్రీ గురించి, రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రస్తావించాడు.

ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ గ్రేట్ నెస్ గురించి మనోజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇక్కడకు రావడం చాలా హ్యాపీగా ఉంది. నా ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. చరణ్ గురించి చెప్పాలంటే..చిన్నప్పుడు మేమంతా చెన్నైలో ఉన్నప్పుడు అందరు కలిసి పెరిగాం. చిన్నప్పటి నుండి చరణ్‌కు ఓ మంచి గుణం ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే.. సాయం చేసే గుణం. అది నిజంగా ఈ రోజుల్లో ఎవ్వరికీ ఉండదు. ఎంత గొప్ప నటుడో.. గొప్ప మనిషి కూడా. నన్ను పిలవగానే ఈ రోజు ఇక్కడకు రావడానికి కారణం ఇదే. ఒక స్నేహితుడిగా నేను మాట్లాడటం నా బాధ్యత. ఈ రోజుల్లో చాలా విలువైనది స్నేహం. మనిషి ఎదిగే కొద్దీ.. కొత్త పరిచయాలు చేసుకుని.. పాత వాళ్లను మర్చిపోతుంటారు. కానీ రామ్ చరణ్ అలా కాదు’ అని ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్.

‘2018లో నేను అమెరికాలో ఉన్నప్పుడు దుబాయ్‌లో తెలుగు ఫ్యామిలీకి ఓ కష్టమొచ్చింది. అందులో చిన్న ఆడ పిల్ల కూడా ఉంది. వాళ్లకు ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లమ్ వచ్చి, సిగ్నేచర్లు పెట్టించుకుని, పాస్ పోర్టులు లాక్కొని, కుటుంబాన్నంతా లాక్ చేశారు. వాళ్లకు డబ్బు అవసరం వచ్చింది. నాకు ఫోన్లు వచ్చాయి. నేను సాయం చేశాను. నా దగ్గర కూడా టైట్. ఇబ్బందుల్లో ఉన్నా. ఆ అర్థరాత్రి ఎవరికో చేయాలో తెలియక వెంటనే చరణ్‌కు ఫోన్ చేశాను. పరిస్థితి చెప్పాను. నా వంతు సాయం చేశాను. అర్జంటుగా ఐదు లక్షలు కావాలి. తక్కువయ్యాయి రా ..ఎలా చేయాలి మిత్రమా అని అడగ్గా.. అకౌంట్ నంబర్ పెట్టు బాబాయ్ అని నిమిషంలో పంపిచాడు. నిజంగా బాబాయ్ (చరణ్) ఆ పాప తల్లిదండ్రులు ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. నువ్వు చల్లగా ఉంటావ్. నీకే కష్టం రాకుండా.. ఇంకా వరల్డ్ వరల్డ్ వైడ్‌గా నంబర్ వన్ స్టార్ అయిపోవాలని కోరుకుంటున్నా’ అని మనోజ్ చెప్పగానే విజిల్స్, కేకలతో దద్దరిల్లిపోయింది ఆడిటోరియం.

ఈ సందర్భంగా చిరంజీవి, మోహన్ బాబు రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ‘ఇందాక వస్తుంటే.. ఒకరు అడిగారు. మీరు ఇన్నినాళ్ల నుండి ఫ్రెండ్స్. మీ నాన్నలు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు కలిసిపోతుంటారు అని. భార్యా భర్తల ఫైట్ మధ్యలోకి వెళ్లకూడదు. వాళ్లు కూడా అంతే. కొట్టుకుంటారు.. కలిసిపోతుంటారు. వాళ్లిద్దరూ క్యూట్ టామ్ అండ్ జెర్రీలా అన్నమాట. వాళ్ల రిలేషన్ 45 ఏళ్ల నుండి ఉంది. వాళిద్దరూ కూడా ఎల్లకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నా. చివరిలో ఏ రిలేషన్ బిట్విన్ మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ షుడ్ బి బీ లైక్ ఫిష్ అండ్ వాటర్.. బట్ నాట్ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మాన్’ అంటూ పెదరాయుడు డైలాగ్ మార్చి చెప్పి ఇంప్రెస్ చేశాడు మంచు వారి సొట్ట బుగ్గల చిన్నోడు.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş