iDreamPost
android-app
ios-app

Mahesh Babu: మహేష్ మూవీలో కింగ్ నాగార్జున.. జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Published Feb 01, 2024 | 2:07 PM Updated Updated Feb 01, 2024 | 3:12 PM

రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం సూపర్​స్టార్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ల వెయిటింగ్​కు త్వరలో ఫుల్​స్టాప్ పడనుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది.

రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం సూపర్​స్టార్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ల వెయిటింగ్​కు త్వరలో ఫుల్​స్టాప్ పడనుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది.

  • Published Feb 01, 2024 | 2:07 PMUpdated Feb 01, 2024 | 3:12 PM
Mahesh Babu: మహేష్ మూవీలో కింగ్ నాగార్జున.. జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా!

సినీ పరిశమ్రలో కొన్ని కాంబినేషన్లకు క్రేజ్ మామూలుగా ఉండదు. వారి కలయికలో వచ్చే మూవీస్ కోసం అభిమానులతో పాటు మూవీ గోయర్స్ కూడా ఎదురు చూస్తుంటారు. అలాంటి ఒక కాంబోనే దర్శకధీరుడు రాజమౌళి-సూపర్​స్టార్ మహేష్ బాబు. వీళ్లిద్దరి కలయికలో సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించే రోజులు వచ్చేశాయి. ఇప్పటికే ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన స్టోరీతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. నిన్న మొన్నటి దాకా ‘గుంటూరు కారం’ సినిమా పనులు, విడుదలలో బిజీగా ఉన్న మహేష్ జక్కన్న మూవీ కోసం స్పెషల్​గా ట్రెయిన్ అవుతున్నారు. యాక్షన్ సీన్స్ కోసం ఆయన ప్రత్యేకంగా జర్మనీకి పయనమయ్యారు. ఈ తరుణంలో రాజమౌళి-మహేష్ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా నటించనున్నారట.

మహేష్​తో తీస్తున్న మూవీలో సీనియర్ హీరో నాగార్జున నటించనున్నారని ఫిల్మ్​నగర్ టాక్. సినిమాలో చాలా కీలకమైన ఓ పాత్రకు నాగ్​ను తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నారట. నాగార్జునకు జక్కన్నకు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో తన తండ్రి విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన ‘రాజన్న’ సినిమాకు రాజమౌళి కొంత పనిచేశారు. ఇందులో నాగ్ హీరోగా యాక్ట్ చేసిన విషయం విదితమే. ఇప్పుడు మహేష్​తో జక్కన్న తీస్తున్న మూవీకి నిర్మాత కేఎల్ నారాయణ. ఆయనతోనూ నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. గతంలో కింగ్​తో ఆయన పలు సినిమాలు నిర్మించారు. ఇవన్నీ పక్కనబెడితే.. నాగార్జునకు బాలీవుడ్​లో మంచి గుర్తింపు ఉంది. గతంలో ఆయన అక్కడ పలు చిత్రాలు చేశారు. లేటెస్ట్​గా చూసుకుంటే రణ్​బీర్ కపూర్​ ‘బ్రహ్మాస్త్ర’ సిరీస్​లోనూ ఆయన మెరిశారు.

నాగార్జునకు బాలీవుడ్​లో గుర్తింపు ఉండటంతో ఆయన్ను తీసుకుంటే కలిసొస్తుందని రాజమౌళి భావిస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఆ పాత్రకు నాగ్ పూర్తిగా న్యాయం చేయగలరని.. ఆయనే కరెక్ట్ అని అనుకుంటున్నారట. నాగ్​కు నార్త్​లో ఉన్న ఇమేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారని వినికిడి. సాధారణంగా రాజమౌళి చిత్రాల్లో హీరో, హీరోయిన్లతో పాటు గ్రే, పాజిటివ్ షేడ్స్ ఉన్న పలు పాత్రలు కనిపిస్తుంటాయి. అలాంటి ఓ కీలక పాత్రకు నాగ్​ను తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఇది జస్ట్ రూమర్ మాత్రమే. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి గానీ నాగార్జున నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే మూవీ లవర్స్ మాత్రం మహేష్, నాగార్జున కలసి స్క్రీన్​పై కనిపిస్తే ఇంక జాతరేనని అంటున్నారు. మరి.. మహేష్-జక్కన్న చిత్రంలో నాగ్ నటిస్తే చూడాలని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet