iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

  • Published Sep 25, 2024 | 4:05 PM Updated Updated Sep 25, 2024 | 4:05 PM

Madhura Pandit Jasraj: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విషాదాలు నెలకొంటున్నాయి. సెలబ్రెటీలు వరుసగా కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

Madhura Pandit Jasraj: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విషాదాలు నెలకొంటున్నాయి. సెలబ్రెటీలు వరుసగా కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నెల వ్యవధిలోనే పలువురు సెలబ్రెటీలు కన్నుమూశారు. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యల కారణంగా చనిపోతున్నారు. బాలీవుడ్ నటి ఆశా వర్మ, నటుడు నిర్మల్ బెన్ని, బిజిలి రమేష్, బాలీవుడ్ నటుడు వికాస్ సేథీ, కోలీవుడ్ ప్రొడ్యూసర్ ఢిల్లీ బాబు, సీఐడీ శకుంతల కన్నుమూశారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిత్ బస్రాజ్ సతీమణి, ప్రముఖ సినీ నిర్మాత వి శాంతారామ్ కూతురు మాధురు బస్రాజ్ (86) ముంబైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్దాప్య కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతు ఆమె నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమెకు పిల్లలు శరంగ్‌దేవ్ పండిట్, కుమార్తె దుర్గా జస్‌రాజ్ నలుగురు మనవరాళ్లు ఉన్నారని ఆమె సన్నిహితులు ప్రీతమ్ శర్మ తెలిపారు. ఆమె భౌతిక కాయాన్ని వెర్సోవాలోని ఆమె ఇంటి వద్ద ఉంచారు. అంత్యక్రియల ఊరేగింపు తర్వాత ఓషివారా శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించబడతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషించిందని అంటారు.

1962లో పండిట్ బస్రాజ్‌ని వివాహం చేసుకొని కొంతకాలం పాటు కోల్‌కొతాలో నివసించారు.ఇండస్ట్రీలో రచయితగా, చిత్రనిర్మాతగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మధుర తన భర్తకు నివాళిగా ‘సంగీత్ మార్తాండ్ పండిట్ జస్రాజ్’ (2009) అనే ప్రసిద్ధ డాక్యుమెంటరీని రూపొందించింది. అంతే కాదు ఆమె తన తండ్రి వి శాంతారామ్ జీవితాన్ని ఆధారంగా తీసుకొని ‘ ద మ్యాన్ హు చేంజ్ ఇండియన్ సినిమా’ అనే పుస్తకాన్ని రచించారు. 2010లో మధుర బస్రాజ్ తన మొదటి మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించింది. ‘ఆయ్ తుజా ఆశీర్వాద్’ ఒక ఫీచర్ ఫిల్మ్‌‌తో తొలి దర్శకురాలిగా చరిత్ర సృష్టించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.