iDreamPost
android-app
ios-app

LCU కి “లియో” ని ఎలా లింక్ చేశారు? ఈ ట్విస్ట్ గమనించారా?

లియో సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుని, కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమాకు ఎల్‌సీయూకు సంబంధం ఏంటన్నది ప్రేక్షకులకు కూడా అంతుపట్టిని విధంగా ఓ భారీ ట్విస్ట్‌ ద్వారా లోకేష్‌ రివీల్‌ చేశాడు.

లియో సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుని, కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమాకు ఎల్‌సీయూకు సంబంధం ఏంటన్నది ప్రేక్షకులకు కూడా అంతుపట్టిని విధంగా ఓ భారీ ట్విస్ట్‌ ద్వారా లోకేష్‌ రివీల్‌ చేశాడు.

LCU కి “లియో” ని ఎలా లింక్ చేశారు? ఈ ట్విస్ట్ గమనించారా?

లియో.. దళపతి విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ముందునుండి చెప్పుకుంటున్న విధంగానే లియో.. LCU భాగంగానే తెరపైకి వచ్చింది. కానీ.. లియోని, LCU తో ఎలా లింక్ చేశారు? ఖైదీ, విక్రమ్ లతో లియోని ఎక్కడ కనెక్ట్ చేశారు? అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం.

ముందుగా నెపోలియన్ లియోలోకి ఎంట్రీ ఎలా ఇచ్చాడు? ఎక్కడో తిరుచ్చిలో డ్రగ్స్ పట్టుబడితే.. అక్కడి నుండి హిమాచల్ ప్రదేశ్ కి ఎలా వచ్చాడు? అనే డౌట్ రావచ్చు. ఖైదీ, విక్రమ్ లకు లింక్ 2 డ్రగ్ కంటైనర్స్. ఒకటి బిజాయ్ హ్యాండిల్ చేస్తే.. మరోటి విక్రమ్ కొడుకు ప్రభంజన్ హ్యాండిల్ చేస్తుంటాడు. ఆ డ్రగ్ బరస్ట్ వల్ల ప్రభంజన్ చనిపోగా.. బిజాయ్ ఫ్యామిలీని కోల్పోతాడు. దీంతో విక్రమ్ రంగంలోకి దిగి.. అసలేం జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఇంతలో విక్రమ్ ఎవరు? అనే విషయాన్నీ బోర్డు రూమ్ లో అమర్ రివీల్ చేసేటప్పుడు.. ఇంకో సీన్ ఉండాలి. విక్రమ్ నుండి LCU కి లింక్ చేసే ఆ సీన్ ని లోకేష్ రిమూవ్ చేసాడట.

ఆ సీన్ ఏంటంటే.. ఎప్పుడైతే అమర్ ఘోస్ట్ గురించి స్పీచ్ స్టార్ట్ చేస్తాడో.. అప్పుడే ఓ ఆఫీసర్ పక్క రూమ్ కి వెళ్లి మిషన్ గన్ చూస్తాడు. ఈ గన్ తో అంతమందిని ఎదురించింది నువ్వా? అని ప్రశ్నిస్తాడు. అక్కడ కెమెరా తిప్పితే.. అతను నెపోలియన్. వాస్తవానికి నెపోలియన్ ఆ గన్ మోయలేడు. కట్ చేస్తే.. అక్కడి నుండి మళ్ళీ అమర్ దగ్గరికి ఆఫీసర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు అర్థమైందిగా.. తిరుచ్చి డ్రగ్ ఇష్యూ తర్వాత నెపోలియన్ వచ్చేది విక్రమ్ లో. ఇక్కడ నెపోలియన్ కి తన లాస్ట్ 60 రోజుల పోస్టింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని లియో దగ్గర వస్తుంది. ఇక్కడ కూడా లియోకి నెపోలియన్ పేపర్ కటింగ్ చూపిస్తాడు. అది తమిళంలో రాసి ఉంటుంది.

ఆ న్యూస్ పేపర్ తెలుగులో ఎందుకు లేదనే డౌట్ మీకు రావచ్చు. ఇన్సిడెంట్ జరిగింది తిరుచ్చిలో సో అలా వేశారు. స్టేట్స్ పరంగా తెలంగాణ గురించి వచ్చినప్పుడు తెలుగులో చూపించారు. ఆ న్యూస్ లో ఢిల్లీ ఉపయోగించిన మిషన్ గన్ తో పాటు నెపోలియన్ ఫోటో ఉంటుంది. బ్యాగ్ కూడా మోయలేని నెపోలియన్ మిషన్ గన్ ఎలా లేపాడు? అనేది ఇందులో లియో అడుగుతాడు. ఇక్కడే దిల్లీ రిఫరెన్స్ మళ్ళీ వస్తుంది. తెలుసు కదా.. LCU లో నెక్స్ట్ వచ్చేది ఖైదీ 2నే. ఇక సినిమాలో నెపోలియన్ కి సరైన సీన్స్ పడ్డాయి. ఎలివేషన్స్ లో కూడా ఎక్కడ తగ్గలేదు. పైగా నెపోలియన్ కి కూడా డ్రగ్స్ లేని సొసైటీ చూడాలనేది కోరిక.

కట్ చేస్తే..క్లైమ్యాక్స్ లో ఇక లియో ఐడెంటిటీ ఎవరికి తెలియదు అన్నప్పుడు ఓ కాల్ వస్తుంది. అది విక్రమ్ నుండి. డ్రగ్స్ ఉన్న బిల్డింగ్ ని కాల్చేసిన వాళ్ళు మా టీమ్ లో కూడా కావాలని చెప్తారు. ఇక్కడ LCU లింక్ ఏంటి ఇలా చూపించారు? అనుకోవచ్చు. కానీ.. అదే టైమ్ లో ‘నేనెవరో తెలుసు కదా’ అని విక్రమ్ డైలాగ్ వస్తుంది. అసలు లియోకి, విక్రమ్ కి లింకేంటి? ఒకరికొకరు ఎలా తెలుసు? అనే విషయాన్ని రివీల్ చేయలేరు. సో.. ఫ్యూచర్ లో రివీల్ చేసే ఛాన్స్ ఉంది. మరో విషయం ఏంటంటే.. విక్రమ్ ఓల్డ్ గ్యాంగ్ చనిపోవడంతో కొత్త గ్యాంగ్ క్రియేట్ చేస్తున్నాడు. అలాగే మోనింగ్ అమ్మాయి కూడా ఉంది. ఆమె స్టోరీ LCU లో కంటిన్యూ కావచ్చు. క్లైమాక్స్ లో ఎస్ సార్, ఓకే సార్ అని రోలెక్స్ బిజీఎం వదిలి మైండ్ బ్లాక్ చేశారు.

దీని ప్రకారం.. లియో, విక్రమ్ లకి ముందునుండి పరిచయం ఉంది. ఇప్పుడు నెపోలియన్ కూడా లియో పక్కనే ఉన్నాడు. నెక్స్ట్ పార్ట్ లో బిజాయ్ తో పాటు పక్కాగా దిల్లీ కూడా వస్తాడు. విక్రమ్ తో కలిసి రోలెక్స్ ని వీళ్ళందరూ ఎలా ఎదురిస్తారు? వంటి చాలా ప్రశ్నలు అలా వదిలేశాడు లోకేష్. చుడాలి మరి ఏం జరుగుతుందో.. ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2. ఫైనల్ గా లియోని, LCU లో భాగం చేసిన లింక్ ఎలా అనిపించింది? మీకు ఏమైనా వేరే లింక్స్ కనిపించాయా? కామెంట్స్ లో తెలియజేయండి.