iDreamPost
android-app
ios-app

కుర్చీ తాత మిస్సింగ్.. 7 రోజులుగా దొరకని ఆచూకీ!

కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికి తెలిసిందే. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన డైలాగ్ అది. ఆ డైలాగ్ చెప్పిన కుర్చీ తాత కూడా సెలబ్రిటీ అయిపోయారు.

కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికి తెలిసిందే. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన డైలాగ్ అది. ఆ డైలాగ్ చెప్పిన కుర్చీ తాత కూడా సెలబ్రిటీ అయిపోయారు.

కుర్చీ తాత మిస్సింగ్.. 7 రోజులుగా దొరకని ఆచూకీ!

కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికి తెలిసిందే. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన డైలాగ్ అది. ఆ డైలాగ్ చెప్పిన కుర్చీ తాత కూడా సెలబ్రిటీ అయిపోయారు. సెలబ్రిటీలకు సైతం రాని ఫాలోయింగ్ కుర్చీతాతకు వచ్చిందంటే కుర్చీ తాత డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ప్రభావం చూపించిందో వేరే చెప్పక్కర్లేదు. కుర్చీ తాత ఫేమస్ అయిన తర్వాత పలు యూట్యూబ్ చానల్స్ వారు కుర్చీ తాత ఇటర్వ్యూల కోసం క్యూలు కట్టారు. సినిమా వాళ్లు కూడా ప్రమోషన్స్ కోసం కుర్చీ తాత సాయం తీసుకున్నారు.

అయితే గత కొంత కాలం నుంచి కుర్చీతాత ప్రభావం తగ్గిపోయింది. ఈక్రమంలో కొన్ని రోజులుగా కుర్చీ తాత కనపించడం లేదంటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దాదాపు 7 రోజుల నుంచి ఆచూకీ లభించడం లేదని ఓ యూట్యూబ్ చానల్ ద్వారా కుర్చీ తాత భార్య, కూతురు వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని వారు వేడుకుంటున్నారు. అన్ని చోట్ల వెతికామని తెలిపారు. కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండే కుర్చీ తాత కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ తో సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచారు. యువతకు ఆ డైలాగ్ విపరీతంగా నచ్చడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ తో కుర్చీ తాత జీవితం పూర్తిగా మారిపోయింది.

ఇదే అదునుగా భావించిన పలు యూట్యూబ్ చానల్స్ కుర్చీ తాత ఇంటర్య్వూల కోసం ఎగబడ్డారు. ఈ కారణంతో సోషల్ మీడియాలో మరింత ప్రాచూర్యం పొందారు. అయితే తాజాగా కుర్చీ తాత కనిపించడం లేదనే విషయం హాట్ టాపిక్ గా మారింది. గత ఏడు రోజులుగా ఆచూకీ లభించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అన్ని చోట్ల వెతికామని ఎక్కడా జాడ దొరకలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండే స్థానికులను కూడా అడిగి తెలుసుకున్నామని గత 7 రోజుల నుంచి కనిపిస్తలేరని చెప్పినట్లు కుర్చీ తాత కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు కుర్చీతాత భార్య చెప్పారు. మరి కర్చీ తాత మిస్సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి