P Krishna
Soundarya Jagadis Passed away: గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు
Soundarya Jagadis Passed away: గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు
P Krishna
ఈ మధ్య సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర టెక్నికల్ డిపార్ట్ మెంట్ కి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. కొంతమంది కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పపడుతున్నారు. ఏది ఏమైనా సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు? ఎక్కడ? అన్న విషయం గురించి తెలుసుకుందాం.
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త సౌందర్య జగదీశ్ అనుమానాస్పద స్థితిలో ఆయన ఇంట్లో శవంగా కనిపించారు. మహాలక్ష్మి లే అవుట్ లో నివాసం ఉండే జగదీశ్ (55) బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు. జగదీశ్ ఆపస్మారక స్థితిలో కనిపించగా కుటుంబ సభ్యులు వెంటనే రాజీవ్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. అసహజ మరణంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అంత్యక్రియల నిమిత్తం ఆయన మృతదేహాన్ని స్వగృహంలో ఉంచారు.
జగదీష్ మరణాంతరం ఆయన సతీమణి ఫిర్యాదు చేసినట్లు డీసీపీ సైదులు అదావత్ తెలిపారు. ‘మేము కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఇటీవల జగదీశ్ అత్తమ్మ చనిపోయింది. ఆమెతో ఎంతో అనుబంధం ఉన్న జగదీశ్ ఆ విషయం జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఒత్తిడి తగ్గేందుకు మెడిసన్స్ తీసుకుంటున్నట్లు సమాచారం.అదే డిప్రేషన్ తో ఆత్మహత్యకు పాల్పపడి ఉండొచ్చని భావిస్తున్నాం’ అని అన్నారు. కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు లేవని జగదీశ్ బంధువులు విలేకరులకు చెప్పారు. అప్పు అండ్ పప్పు, మస్త మజా మాది, స్నేహితరు, రామలీల వంటి హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు జగదీశ్. ఆయన మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.