iDreamPost
android-app
ios-app

‘కల్కి 2898 ఏడీ’ డిజిటల్ స్ట్రీమింగ్​పై క్లారిటీ.. ఆ తేదీ నుంచే OTTలో సందడి!

  • Published Jul 11, 2024 | 7:59 PM Updated Updated Jul 11, 2024 | 7:59 PM

Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్​లో మెమరబుల్ హిట్​గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్​లో మెమరబుల్ హిట్​గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Published Jul 11, 2024 | 7:59 PMUpdated Jul 11, 2024 | 7:59 PM
‘కల్కి 2898 ఏడీ’ డిజిటల్ స్ట్రీమింగ్​పై క్లారిటీ.. ఆ తేదీ నుంచే OTTలో సందడి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్​లో మెమరబుల్ హిట్​గా నిలిచిందీ మూవీ. రూ.1,000 కోట్ల మార్క్​ను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మాగ్నమపస్ ఫిల్మ్​ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. రిలీజై రెండు వారాలు కావొస్తున్నా ఇంకా వసూళ్ల వర్షం తగ్గడం లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ‘కల్కి’ హవా మామూలుగా లేదు. ముఖ్యంగా నార్త్ బెల్త్​లో ప్రభాస్ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే పలు రికార్డులు బ్రేక్ చేసిన ఈ చిత్రం.. ఫుల్ రన్​లో ఇంకెన్ని రికార్డులకు పాతర వేస్తుందో చూడాలి. థియేటర్స్​లో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతున్న ‘కల్కి’ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

‘కల్కి 2898 ఏడీ’ని బిగ్ స్క్రీన్స్​లో ఎంజాయ్ చేసిన ఆడియెన్స్.. ఓటీటీ వెర్షన్ రిలీజ్ కోసం ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. మూడ్నాలుగు సార్లు చూసి నాగ్ అశ్విన్ వదిలిన హింట్స్​ను మరింత అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్​కు సంబంధించి ఇప్పటికే కొన్ని డేట్స్ వచ్చాయి. అయితే దేన్నీ చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేయలేదు. బిగ్ స్క్రీన్స్​లో బాగా రన్ అవుతుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే డిజిటల్ పార్ట్​నర్స్​ ఎవరో మాత్రం అఫీషియల్​గా బయటకు వచ్చింది. హిందీ వెర్షన్​కు నెట్​ఫ్లిక్స్, సౌతిండియన్ లాంగ్వేజెస్​కు ప్రైమ్ వీడియో పార్ట్​నర్స్​గా ఉన్నాయి. ఈ ప్లాట్​ఫామ్స్​లో ‘కల్కి’ సందడి చేయనుంది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి కొంత క్లారిటీ వచ్చింది.

ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన ‘కల్కి 2898 ఏడీ’ ఓటీటీ వెర్షన్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. తొలుత స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అదే నెల 15వ తేదీన డిజిటల్ స్ట్రీమింగ్​ మొదలుపెట్టాలని మేకర్స్ అనుకున్నారట. అయితే దీనిపై వెనక్కి తగ్గారట. ఎట్టకేలకు ఆగస్టు 23ను ఫిక్స్ చేశారని వినికిడి. మొదట ప్రైమ్ వీడియోలో దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత నెట్​ఫ్లిక్స్ వేదికగా ఇంగ్లీష్ సబ్​టైటిల్స్​తో హిందీ వెర్షన్​ను అందుబాటులోకి తీసుకురానున్నారట. ఇక, ఈ సైఫై థ్రిల్లర్ ఫిల్మ్​లో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్​తో పాటు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ క్యామియోలుగా మెరిశారు. వీరిలో జక్కన్న, ఆర్జీవీ తన ఫేవరెట్ కామియోస్ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం. మరి.. ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler