iDreamPost
android-app
ios-app

మరో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్! ఇండియాలోనే రెండోది! ధర తెలిస్తే నమ్మలేరు!

  • Published Jul 11, 2024 | 7:07 PM Updated Updated Jul 11, 2024 | 7:07 PM

Ram Charan Bought Rolls Royce Spectre Luxury Car: రామ్ చరణ్ దగ్గర ఇప్పటికే పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ మరో లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీంతో రామ్ చరణ్ కార్ల కలెక్షన్స్ లో ఈ కారు కూడా చేరిపోయింది. అయితే ఈ కారు ఇండియాలో ఇద్దరి దగ్గర మాత్రమే ఉంది. అందులో చరణ్ రెండో వ్యక్తి. హైదరాబాద్ లో ఈ కారు కలిగిన మొదటి వ్యక్తి చరణ్ కావడం విశేషం. మరి దీని ధర ఎన్ని కోట్లో తెలుసా?

Ram Charan Bought Rolls Royce Spectre Luxury Car: రామ్ చరణ్ దగ్గర ఇప్పటికే పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ మరో లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీంతో రామ్ చరణ్ కార్ల కలెక్షన్స్ లో ఈ కారు కూడా చేరిపోయింది. అయితే ఈ కారు ఇండియాలో ఇద్దరి దగ్గర మాత్రమే ఉంది. అందులో చరణ్ రెండో వ్యక్తి. హైదరాబాద్ లో ఈ కారు కలిగిన మొదటి వ్యక్తి చరణ్ కావడం విశేషం. మరి దీని ధర ఎన్ని కోట్లో తెలుసా?

మరో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్! ఇండియాలోనే రెండోది! ధర తెలిస్తే నమ్మలేరు!

సెలబ్రిటీలన్నాక లగ్జరీ కార్లు, లగ్జరీ బైకులు, లగ్జరీ వాచెస్ ఇలా లగ్జరీ వస్తువులను మెయింటెయిన్ చేయడం అనేది సర్వసాధారణం. ఎన్టీఆర్ లాంటి హీరోలకు బైక్స్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువగా బైక్స్ కలెక్షన్స్ ఉంటాయి. అలానే వాచెస్ కూడా. ఇక నాగ చైతన్య లాంటి హీరోలకు కార్లంటే పిచ్చి కాబట్టి కొత్త కొత్త స్పోర్ట్స్ లగ్జరీ కార్లను కొని తన గ్యారేజ్ లో చేరుస్తుంటారు. తాజాగా రామ్ చరణ్ కూడా తన గ్యారేజ్ లో కార్ల జాబితాలో లగ్జరీ కారుని చేర్చారు. హైదరాబాద్ లో చరణ్ కి ఉన్న కారు మరెవరికీ లేకపోవడం గమనార్హం. ఇప్పటికే రామ్ చరణ్ దగ్గర ఖరీదైన లగ్ జరీ కార్లు ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ ఖాతాలో మరో లగ్జరీ కారు చేరింది. అదే రోల్స్ రాయిస్ కారు. చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే రోల్స్ రాయిస్ కార్లు ఉంటాయి.

మన దేశంలో అంబానీ, ధోనీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి సెలబ్రిటీల దగ్గర రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. మన తెలుగు హీరోల దగ్గరకు వస్తే మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్ దగ్గర రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ కూడా ఈ రోల్స్ రాయిస్ కార్ల ఓనర్ జాబితాలో చేరిపోయారు. రోల్స్ రాయిస్ లేటెస్ట్ ఫాంటమ్ మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఇది 6.75 లీటర్ల ట్విన్ టర్బో ఛార్జ్డ్ వీ12 ఇంజిన్ తో వస్తుంది. 563 హార్స్ పవర్ అవుట్ పుట్ తో.. 900 ఎన్ఎం టార్క్ ని డెలివర్ చేస్తుంది. కేవలం 5.4 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. దీని ధర మోడల్ ని బట్టి ఇండియాలో రూ. 8.99 కోట్ల నుంచి రూ. 10.48 కోట్లు. ఢిల్లీ ఎక్స్ షోరూం ధర 9.50 కోట్లు.

ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ రోల్స్ రాయిస్ కారులో వెళ్లారు. ఈ కారుని రామ్ చరణ్ స్వయంగా నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా ఈ కారు ఈ ఏడాది జనవరి నెలలో విడుదలైంది. రామ్ చరణ్ గతంలో బుక్ చేయగా ఇటీవలే కారు డెలివరీ అయ్యింది. అయితే హైదరాబాద్ లో ఈ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారు కొన్న తొలి వ్యక్తిగా రామ్ చరణ్ ఉన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ లతో సినిమాలు లైన్ లో ఉన్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఉత్తరాదిన కూడా చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.  

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisJojobetHoliganbetJojobet GirişJojobet - Güncel Giriş Adresi, Bonus ve Üyelik 2026