iDreamPost
android-app
ios-app

కల్కిలో భైరవ ఆంథమ్ పాడిన ఈ సింగర్ బ్యాగ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Kalki 2898 AD Movie Bhairava Anthem singer Diljit Dosanjh Background: కల్కి 2898 ఏడీ మూవీలో ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. భైరవ ఆంథమ్ ని అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ సింగర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అతను వరల్డ్ ఫేమస్ సింగర్ అని మీకు తెలుసా?

Kalki 2898 AD Movie Bhairava Anthem singer Diljit Dosanjh Background: కల్కి 2898 ఏడీ మూవీలో ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. భైరవ ఆంథమ్ ని అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ సింగర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అతను వరల్డ్ ఫేమస్ సింగర్ అని మీకు తెలుసా?

కల్కిలో భైరవ ఆంథమ్ పాడిన ఈ సింగర్ బ్యాగ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

కల్కి 2898 ఏడీ.. ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవల్లో సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఇది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతోంది. జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో ఈ మూవీ విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మూవీ టీమ్ అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, బుజ్జి- భైరవ యానిమేషన్ సిరీస్ ఇలా వరుస అప్ డేట్స్ ఇచ్చిన టీమ్ ఇప్పుడు తాజాగా ఫస్ట్ సింగిల్ ని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ సాంగ్ లో ఉన్న సింగర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, అతని బ్యాగ్రౌండ్ చూస్తే మాత్రం అందరూ కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే.

భైరవ ఆంథమ్ సాంగ్ పాడిన సింగర్ పేరు దిల్జిత్ దోశాంజ్. ఇతను కేవలం సింగర్ మాత్రమే కాదు. యాక్టర్, ప్రొడ్యూసర్ కూడా. అంతేకాకుండా టీవీల్లో ఫుల్ హడావుడి చేసేస్తాడు. పలు షోస్ కి జడ్జ్ గా కూడా వ్యవహరించాడు. ఈయన పేరు మనకు అయితే కొత్త కావచ్చు. కానీ, పంజాబ్ లో ఈయన చాలా పెద్ద సెలబ్రిటీ. ఇక్కడ మన టాప్ హీరోలకు ఉన్నంత క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ దిల్జిత్ పాటలకు కోట్లలో వ్యూస్, డిమాండ్ ఉంది. అలాగే ఈయన చేసిన సినిమాలు కూడా అద్భుతంగా ఆడటమే కాకుండా.. అవార్డుల మీద అవార్డుల తెచ్చిపెట్టాయి. ఉడ్తా పంజాబ్ సినిమా చూసిన వారికి ఈ దిల్జిత్ దోశాంజ్ తెలిసే ఉంటాడు. ఎందుకంటే ఆ సినిమాతోనే బాలీవుడ్ లో తెరంగేట్రం చేశాడు. అంతేకాకుండా.. బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

2020లో బిల్ బోర్డ్ మ్యాగ్ జైన్ నిర్వహించే సోషల్ 50 జాబితాలో దిల్జిత్ దోశాంజ్ పేరు వచ్చింది. ఇది వరల్డ్ వైడ్ గా ఉన్న ఫేమస్ మ్యూజీషన్స్ లిస్ట్ అనమాట. పంజాబ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీస్ మనోడివే. జాట్ అండ్ జూలియట్2, పంజాబ్ 1984 వంటి చిత్రాలు చేసింది దిల్జిత్ దోశాంజే. 2005లో మ్యూజిక్ స్టార్ట్ చేసిన దిల్జిత్.. 2011లో ది లైన్ ఆఫ్ పంజాబ్ అనే సినిమాతో యాక్టర్ గా మారాడు. మ్యూజిక్ తోనే ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బిల్ బోర్డ్ చార్ట్స్ లో మూడు పాటలతో.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ గా దిల్జిత్ చరిత్ర సృష్టించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దిల్జిత్ దోశాంజ్ హిస్టరీ, క్రియేట్ చేసిన రికార్డులు చాలానే ఉన్నాయి. యాక్టింగ్- మ్యూజిక్ కి సంబంధించి దిల్జిత్ దోశాంజ్ ఏకంగా 34 అవార్డులు గెలుచుకున్నాడు. 23 అవార్డులకు నామినీగా ఉన్నాడు.

ఇంక సోషల్ మీడియాలో దిల్జిత్ కి ఉన్న క్రేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం ఇన్ స్టాగ్రామ్ లోనే దిల్జిత్ దోశాంజ్ కి ఏకంగా 21 మిలియన్స్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. వరల్డ్ వైడ్ గా ఫుల్ ఫేమస్ అయిన సింగర్, మ్యూజిక్ కంపోజర్ ఎడ్ షీరన్ తో కలిసి స్టేజ్ మీద లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా ఎడ్ షీరన్ తో మొట్ట మొదటిసారి ఒక హిందీ సాంగ్ పాడించాడు. ఇలాంటి ఫుల్ ఫేమస్ సింగర్ తో కల్కి 2898 ఏడీ మూవీలో భైరవ్ ఆంథమ్ సాంగ్ పాడించారు అంటే చిన్న విషయం కాదనే చెప్పాలి. మరి.. భైరవ ఆంథమ్ సాంగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి