iDreamPost
android-app
ios-app

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ రేర్ రికార్డ్ .. సింహాసనంపై NTR

  • Published Oct 14, 2024 | 5:47 PM Updated Updated Oct 14, 2024 | 5:47 PM

నిన్న మొన్నటివరకు కూడా దేవర సినిమా ఉత్సాహంలో మునిగి తేలారు ప్రేక్షకులు. ఆరేళ్ళ ఆకలి ఒకేసారి తీర్చడమే కాకుండా.. బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా తేల్చాడు తారక్. మరి ఆ లెక్కలేంటో చూసేద్దాం.

నిన్న మొన్నటివరకు కూడా దేవర సినిమా ఉత్సాహంలో మునిగి తేలారు ప్రేక్షకులు. ఆరేళ్ళ ఆకలి ఒకేసారి తీర్చడమే కాకుండా.. బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా తేల్చాడు తారక్. మరి ఆ లెక్కలేంటో చూసేద్దాం.

  • Published Oct 14, 2024 | 5:47 PMUpdated Oct 14, 2024 | 5:47 PM
మ్యాన్ ఆఫ్ ది మాసెస్ రేర్ రికార్డ్ .. సింహాసనంపై NTR

కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను కుమ్మేసింది దేవర . యంగ్ టైగర్ శివ తాండవం ఆడాడు. మిక్స్డ్ టాక్ తో మొదలైనా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ ను దక్కించుకోవడం చిన్న విషయం కాదు. దేవర సినిమాకు ప్రతి ఒక్కటి కలిసొచ్చాయి. దీనితో అనుకున్నట్లుగానే 500 కోట్ల మార్క్ ను దాటింది. ఇది మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మాస్ రికార్డ్. ఆల్రెడీ లాభాల పరంగా 50 కోట్ల మైలు రాయిని కూడా దాటేసింది ఈ సినిమా. పైగా అభిమానుల ఆరేళ్ళ ఆకలి ఒకేసారి తీర్చడమే కాకుండా.. బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా తేల్చాడు తారక్. ముఖ్యంగా రీసెంట్ టైం లో బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఇక ఇప్పుడు తారక్ మరో మైలు రాయిని అధిగమించాడు .. ఇలాంటి రేర్ ఫీట్స్ తనకే సాధ్యం అని మరోసారి ప్రూవ్ చేశాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మూడవ వీకెండ్ పూర్తయ్యే టైమ్ కి.. ఏకంగా 150 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించింది. ఇది తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సోలో కలెక్షన్స్ సాధించిన సినిమా. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో 150 కోట్లు సాధించిన సినిమా ఇది. ఇలా టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు ఈ మార్క్ ను అందుకున్న రెండో హీరోగా ఎన్టీఆర్ కొత్త రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ప్రభాస్ మూడు సార్లు.. తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల షేర్ మార్క్ ను అందుకున్నాడు. అలా సలార్ , కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రికార్డ్ సాధించిన మొదటి హీరోగా నిలిచి సింహాసనాన్ని అధిగమించాడు. ఇక ఇప్పుడు అదే సింహాసనాన్ని తారక్ అధిగమించి ఇది తారక్ మాస్ రికార్డ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మరి రానున్న రోజుల్లో ఇలాంటి రికార్డ్ ను టచ్ చేసే హీరో ఎవరో చూడాలి.

ఇక ఈ సినిమా ఓటీటీ డేట్ ఇదేనంటూ బజ్ కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు దాదాపు దేవర థియేట్రికల్ రన్ ఎండ్ కు వచ్చినట్లే. మరి ఎండ్ లోపు టోటల్ కలెక్షన్స్ ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా తారక్ కు, తారక్ అభిమానులకు ఇది చాలా స్పెషల్ మూవీ. మిక్స్డ్ టాక్ తో మొదలైనా కానీ.. అభిమానులు ఓ రేంజ్ లో హిట్ చేశారు. అలాగే అటు దర్శకుడికి హిట్ ఇవ్వడంతో.. డైరెక్టర్ కు కూడా బడా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు దేవర పార్ట్- 2 ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం తారక్ వార్-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా తారక్ తీరిక లేకుండా బిజీ బిజీగా ఉన్నాడు. సో పార్ట్-2 రాడానికి ఇంకా చాలానే సమయం ఉంది. మరి తారక్ సాధించిన రేర్ ఫీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.