iDreamPost
android-app
ios-app

ఈ స్టార్ విలన్ బ్యాగ్రౌండ్ తెలుసా… బోర్డులపై పెయింట్ వేసే స్థాయి నుండి

ఎన్నో సినిమాల్లో తన విలనిజంతో భయపెట్టాడు ఈ నటుడు. తమిళంలో కాదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే.. సక్సెస్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు..

ఎన్నో సినిమాల్లో తన విలనిజంతో భయపెట్టాడు ఈ నటుడు. తమిళంలో కాదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే.. సక్సెస్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు..

ఈ స్టార్ విలన్ బ్యాగ్రౌండ్ తెలుసా… బోర్డులపై పెయింట్ వేసే స్థాయి నుండి

వెండితెరపై నెగిటివ్ రోల్స్ చేసి పాపులారిటీని తెచ్చుకున్నారు ఎంతో మంది యాక్టర్స్. ఆనాటి రాజనాల, రమణా రెడ్డి నుండి ఈనాటి ప్రకాష్ రాజ్, సునీల్, ఫహాద్ ఫజిల్ స్టార్ విలన్ల వరకు ఎంతో మంది ఆకట్టుకున్నారు. కాగా, తెరపై కనిపించేంత సేపు తమ విలనిజంతో భయపెట్టారు. రియల్ లైఫ్‌లో కూడా ఇలానే ఉంటారేమో అనుకునేంతలా యాక్ట్ చేస్తుంటారు. మహిళా ప్రేక్షకులైతే సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి తిట్టిపోస్తుంటారు కూడా. కానీ నిజ జీవితంలో వీరంతా చాలా సౌమ్యులు. తెరపై భయపెట్టిన ఈ విలన్లు.. మేకప్ తీసేశాక మనలాంటి సామాన్యులే. ఇదిగో ఈ ఫోటోలో కరుడుగట్టిన విలన్‌లా కనిపిస్తున్న ఆయన బయట ఎన్నో మంచి పనులు చేశాడు.

తమిళంలో స్టార్ విలన్లలో ఒకరు సాయి ధీనా. ఎక్కువగా తమిళ సినిమాలు చేశాడు. అప్పుడప్పుడు కామెడీ రోల్స్ పోషించాడు. కానీ ఎన్నో కష్ట నష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు సైన్ బోర్డులకు ఆర్టిస్టుగా (బోర్డులపై పెయింట్స్ వేయడం) పనిచేశాడు. ఆ తర్వాత రైల్వే ఉద్యోగం. కష్టాలు తీరతాయి కానీ.. సినిమా, యాక్టింగ్ అంటే ఇష్టంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కమల్ హాసన్ పోతురాజు మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధీనా.. తర్వాత విలన్ పాత్రలు పలకరించడం స్టార్ట్ అయ్యాయి. రజనీకాంత్ ఎంతిరన్ (రోబో) మూవీలో కనిపించాడు. కానీ అతడికి బాగా పేరు తెచ్చిపెట్టాయి దర్శకుడు అట్లీ మూవీస్. స్టంట్ మాస్టర్‌గా వర్క్ చేశాడు. రాజా రాణి మూవీలో బ్యాడ్రాప్‌లో హీరో ఆర్య  కాలేజీలో గొడవ పెట్టుకునేది ఈ నటుడితోనే. అక్కడ నుండి అతడి పాపులారిటీ పెరిగింది. అట్లీ అన్ని చిత్రాల్లో యాక్ట్ చేశాడు.

తేరీ (పోలీసోడు), మెర్సల్, బిగిల్, ఇప్పుడు వచ్చిన జవాన్ చిత్రాల్లో సాయి ధీనా నటించాడు. ఇక తెలుగులో కూడా పలు చిత్రాల్లో కనిపించాడు. కపటధారి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ విలన్, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ చిత్రంలో చేశాడు. చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాల్లో కనిపించాడు. ప్రతి నాయకుడిగా ఎన్నో చిత్రాల్లో యాక్ట్ చేసిన ఈ నటుడు.. బయట మాత్రం ఎన్నో సామాజిక సేవలు అందించాడు. కాదల్ (ప్రేమిస్తే) ఫేమ్ విరుచగాకాంత్ (పల్లు బాబు) చెన్నైలోని దేవాలయాల్లో భిక్షాటన చేసుకుంటున్నాడని తెలిసి ఆర్థిక సాయం అందించాడు. కరోనా సమయంలో కూడా తన వంతు సాయం అందించాడు సాయి ధీనా. 250 మందికి ఆహారాన్ని అందించి గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఈ ఏడాది ఆయన రెండు చిత్రాలతో పలకరించాడు. ప్రస్తుతం బుల్లితెరపై వంటల ప్రోగ్రామ్ లో సందడి చేస్తున్నాడు.