iDreamPost
android-app
ios-app

పూనమ్ పాండే నిజంగానే చనిపోయిందా? ఆ లాజిక్ మిస్!

ఇప్పుడంతా సోషల్ మీడియా కాలమే నడుస్తుంది. ఏ సమాచారం కావాలన్నా ముందుగా సామాజిక మాధ్యమాలనే ఆశ్రయిస్తున్నారు. ఇక అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్.. కన్ఫమ్ అనుకుని బ్రతికేస్తున్నారు. కాదని తెలిశాక అవాక్ అవుతున్నారు. ఇప్పుడు ఓ న్యూస్ కూడా అలాంటి అనుమానమే కలిగిస్తుంది.

ఇప్పుడంతా సోషల్ మీడియా కాలమే నడుస్తుంది. ఏ సమాచారం కావాలన్నా ముందుగా సామాజిక మాధ్యమాలనే ఆశ్రయిస్తున్నారు. ఇక అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్.. కన్ఫమ్ అనుకుని బ్రతికేస్తున్నారు. కాదని తెలిశాక అవాక్ అవుతున్నారు. ఇప్పుడు ఓ న్యూస్ కూడా అలాంటి అనుమానమే కలిగిస్తుంది.

పూనమ్ పాండే నిజంగానే చనిపోయిందా? ఆ లాజిక్ మిస్!

‘నిజం గడప దాటే లోపు.. అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోంది’ అనే నానుడి సోషల్ మీడియాకు సరిగ్గా సరిపోతుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే న్యూస్ దావానంలా వ్యాపిస్తుంది. ఏదీ నిజమో, ఏదీ అబద్దమో తెలియడం లేదు. అబద్దం కూడా వాస్తవంలా నాట్యం చేస్తోంది. నిజం నిలకడ మీద తేలుతుంది కనుక.. నింపాదిగా వాస్తవం తెలిశాక నోళ్లు వెళ్లబెడుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో, ట్రూ ఆర్ ఫాల్స్ అని తేల్చి చెప్పడం కష్టంగా మారింది. వారు స్పందించేంత వరకు ఆ రూమర్లు ఆడి కారు వేసుకుని తిరుగుతుంటాయి. అయోధ్య రామాలయం విషయంలో ప్రభాస్ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొట్టగా.. ఆ తర్వాత ఫేక్ అని తేలింది. ఇలా రోజు ఏదో ఒక సెలబ్రిటీ గురించి.. ఏదో ఒక ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

అయితే ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు అనుమానాలకు తావినిస్తుంది. అదే వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే కన్నుమూసిన వార్త. సోషల్ మీడియాలో ఆమె ఇన్ స్టా ఖాతా నుండి ఈ పోస్టు వచ్చింది. అంతే వెంటనే ఆ న్యూస్ వ్యాపించేసింది. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయిందంటూ వార్తలు వచ్చేశాయి. ఇక న్యూస్ చానల్స్, వెబ్ సైట్స్ అధికారికంగా ఆమె చనిపోయినట్లు ప్రకటించేశాయి కూడా. కొన్ని న్యూస్ ఛానల్స్ ఆమె మీడియా మేనేజర్ ను సంప్రదించి.. కన్ఫమ్ చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడే పలు అనుమానాలకు తావు ఇచ్చినట్లు అయ్యింది. ఎక్కడో చిన్న లాజిక్ మిస్సవుతున్నట్లు భావిస్తున్నారు ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్.  పూనమ్ మరణించి ఉన్నట్లయితే.. ఆమె భౌతిక కాయానికి సంబంధించిన ఒక పిక్ కూడా బయటకు రాలేదు.

అలాగే ఆమెను పరామర్శించి వచ్చిన వాళ్లు మీడియా కంటికి కనిపించలేదు. దీంతో ఇదేమన్నా స్టంటా అని ఆలోచనలో పడ్డారు నెటిజన్లు. ఈ వార్తను అయితే నమ్మట్లేదు. ఆమె ఖాతా హ్యాక్ అయ్యి ఉంటుందని కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. సోమ, మంగళవారం వరకు చలాకీగా కనిపించిన ఆమె.. సడెన్‌గా సర్వికల్ క్యాన్సర్ తో మృతి చెందండం ఏంటన్న ఆలోచనలో పడ్డారు. అలాగే ఇదొక క్యాన్సర్ ఎవర్ నెస్ క్యాంపెయిన్ అయ్యిండచ్చులే అంటూ కొట్టి పడేస్తున్నారు. అలాగే  ఆమెతో భర్తకు గొడవలు ఉన్నాయని, ఆ కోణంలో విచారించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కాంట్రవర్సియల్ క్వీన్ చనిపోయిందంటే.. నమ్మేవాళ్ల కన్నా. .బిలీవ్ చేయని వారి సంఖ్య పెరుగుతుంది. సాధారణంగా ఎప్పుడు ట్రెండింగ్‌లో నిలుచేందుకు ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది.

2011 ప్రపంచ కప్ సమయంలో భారత్ గెలిస్తే.. నగ్నంగా మైదానంలో రన్ చేస్తా అంటూ మీడియా అటెంక్షన్ తీసుకున్న ఆ తర్వాత.. ఇలాంటి స్టంట్సే చేసి వార్తల్లో నిలిచింది. ఇక సోషల్ మీడియాలో అయితే రచ్చ రచ్చ లేపుతుంది. పొట్టి పొట్టి డ్రెస్సులతో అందాల విందు చేసే బ్యూటీ.. బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని 15 రోజుల్లోనే భర్తపై గృహ హింస కేసు పెట్టి మళ్లీ ట్రెండ్ అయ్యింది. అలాగే శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మోసం చేశాడంటూ అతడిపై కేసు పెట్టింది. నిత్యం ట్రెండింగ్‌లో నిలిచేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలాంటిది ఏదో అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరీ ఆమె మరణ వార్త నిజమేనని అంటారా..?

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)