iDreamPost
android-app
ios-app

ప్రముఖ కమెడియన్ VTV గణేశ్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

Interesting Facts About Famous Comedian VTV Ganesh: 'ఎవుర్రా నువ్వు ఇంతా టాలెంటెడ్ గా ఉన్నావ్' అనే డైలాగ్ తెలుగు ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ పాత్ర చేసిన వీటీవీ గణేశ్ గురించి పూర్తి వివరాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Interesting Facts About Famous Comedian VTV Ganesh: 'ఎవుర్రా నువ్వు ఇంతా టాలెంటెడ్ గా ఉన్నావ్' అనే డైలాగ్ తెలుగు ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ పాత్ర చేసిన వీటీవీ గణేశ్ గురించి పూర్తి వివరాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ప్రముఖ కమెడియన్ VTV గణేశ్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు కమెడియన్స్ ఎంతో గుర్తింపు లభిస్తోంది. ఎంత యాక్షన్ చిత్రమైనా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక కమెడియన్ ని వాడేస్తున్నారు. అలా ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే.. వీటీవీ గణేశ్ అని చెప్పచ్చు. బీస్ట్ సినిమాలో ‘ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు’ అనే ఒక్క డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులకు అభిమాన యాక్టర్ అయిపోయాడు. అలాగే మీమర్స్ కు మంచి సబ్జెక్ట్ కూడా. అయితే ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియని చాలానే విషయాలు ఉన్నాయి. మరి.. వీటీవీ గణేశ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు ఏంటో చూద్దాం.

22 ఇయర్స్ ఇండస్ట్రీ:

వీటీవీ గణేశ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏకంగా 22 ఏళ్లు గడుస్తున్నాయి. ఆయన అజిత్ మూవీ రెడ్ తో 2002లో తెరంగేట్రం చేశారు. ఆ మూవీలో చేసిన పాత్రకు కనీసం పేరు కూడా వేయలేదు. ఒక గుర్తింపులేని పాత్రలో కనిపించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు 2006లో వచ్చిన ‘వెట్టాయాడు విలాయాడు’ అనే కమల్ హాసన్ మూవీలో నటించాడు. ఆ మూవీలో సుధాకర్ అని పేరు వేశారు. ఆ తర్వాత చిన్నగా సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. 2010లో ‘విన్నాయ్ తాండి వరువాయ’ చిత్రంతో ప్రొడ్యూసర్ గా కూడా మారారు. ఆ మూవీ నిర్మాతల్లో వీటీవీ గణేశ్ కూడా ఒకరు. అలాగే ఆ మూవీకి బెస్ట్ సపోర్టింగ్ రోల్ కి నామినేట్ కూడా అయ్యారు. ప్రొడ్యూసర్ గా మొత్తం నాలుగు సినిమాలు తీశారు.

తెలుగులో కూడా:

వీటీవీ గణేశ్ తెలుగు సినిమాలో 2010లోనే కనిపించారు. కానీ, అప్పటికి ఆయన ఎవరికీ తెలియదు కాబట్టి గుర్తుపట్టలేదు. అయితే అది కూడా చిన్న అప్పియరెన్సేలెండి. ఆయన తమిళ్ లో ప్రొడ్యూస్ చేసిన మూవీనే తెలుగులో వచ్చిన ఏమాయ చేశావే. ఈ మూవీలోని ‘మనసా సాంగ్’లో ఫిల్మ్ క్రూ మెబర్ లా వీటీవీ గణేశ్ కనిపించారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఏ మూవీ ఉన్నా ఆయన అప్పియరెన్స్ కంపల్సరీ అయిపోయింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం వీటీవీ గణేశ్ ను ప్రత్యేకంగా పెట్టుకుంటున్నారు. అలాగే బాలయ్య భగవంత్ కేసరిలో మినిస్టర్ పాత్రలో మెరిశారు. అలాగే ఫ్యామిలీ స్టార్ లో రమేశ్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఇకపై వచ్చే అన్ని పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఆయన పాత్ర కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే తెలుగు యాడ్స్ లో కూడా వీటీవీ గణేశ్ కనిపించిన విషయం తెలిసిందే.

సింగర్ కూడా:

వీటీవీ గణేశ్ కేవలం కమెడియన్, ప్రొడ్యూసర్ అనుకుంటే మీరు పొరపడినట్లే. ఆయన ఒక మంచి సింగర్ కూడా ‘ఇంగ ఎన్న సొల్లుతూ’ అని ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలో బటర్ ఫ్లై అనే సాంగ్ పాడారు. కేవలం సింగర్ గా పాడటం మాత్రమే కాదు.. ఆ సాంగ్ కి లిరిక్స్ రాసింది కూడా వీటీవీ గణేశే కావడం విశేషం. కప్పల్ అనే సినిమాలో కూడా ఫ్రెండ్ షిప్ అనే సాంగ్ పాడారు. ఆయన జవాన్ సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మారారు. జవాన్ లో నరేశ్ గోసైన్ పాత్రకు తమిళ్ డబ్బింగ్ చెప్పారు. తమిళ్, తెలుగు మాత్రమే కాకుండా.. మలయాళం సినిమాల్లో కూడా వీటీవీ గణేశ్ నటించారు. ఇటీవల వచ్చిన మమ్మూట్టీ రీసెంట్ హిట్ టర్బోలో కూడా వీటీవీ గణేశ్ మెప్పించారు. ప్రస్తుతం ‘కూకు విత్ కోమలి సీజన్ 5’లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. మీరు కూడా ఇప్పటి వరకు వీటీవీ గణేశ్ కేవలం ఒక కమెడియనే అనుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.