iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ కు ఎటు చూసినా సవాళ్ళే కానీ.. !

  • Published Nov 20, 2024 | 6:05 PM Updated Updated Nov 20, 2024 | 6:05 PM

Game Changer Updates: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా నార్త్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ గేమ్ ఛేంజర్ కు ఇప్పుడు ఎటు చూసినా సవాళ్ళే ఎదురౌతున్నాయి.

Game Changer Updates: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా నార్త్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ గేమ్ ఛేంజర్ కు ఇప్పుడు ఎటు చూసినా సవాళ్ళే ఎదురౌతున్నాయి.

  • Published Nov 20, 2024 | 6:05 PMUpdated Nov 20, 2024 | 6:05 PM
గేమ్ ఛేంజర్ కు ఎటు చూసినా సవాళ్ళే కానీ.. !

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా నార్త్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అప్పటివరకు సినిమా నుంచి సరైన అప్డేట్స్ రాకపోవడంతో అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు అభిమానులు కూడా ఆశలు వదులుకున్నారు. అదిగో ఇదిగో అంటూ ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జరగండి జరగండి అంటూ చిరు సినిమాను తప్పించి ఈ సినిమా సీన్ లోకి ఎంటర్ అయ్యింది. జనవరి 10 న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. సంక్రాంతి సీజన్ గేమ్ ఛేంజర్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. టీజర్ తో కొంత బజ్ క్రియేట్ అయింది కానీ అది ఈ రేంజ్ సినిమాకు సరిపోదు. దీనితో ఎలా అయినా సరే ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్లాలని దిల్ రాజు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పూర్తిగా సంక్రాంతి సీజన్ మీదే దిల్ రాజు హోప్స్ పెట్టుకున్నాడు.

ఇంకాస్త స్ట్రాంగ్ గా స్ట్రాటజిక్ గా మార్కెటింగ్ చేస్తే.. రిలీజ్ లోపు అనుకున్న హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ గేమ్ ఛేంజర్ కు ఇప్పుడు ఎటు చూసినా సవాళ్ళే ఎదురౌతున్నాయి. సరిగ్గా సంక్రాంతి సమయంలోనే బాలయ్య ‘డాకు మహారాజ్’ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ రెండింటితో పాటు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రిలీజ్ కాబోతుంది. గేమ్ చెంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అలాగే డాకు మహారాజ్ నైజం రైట్స్ కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ పరంగా గేమ్ ఛేంజర్ కు అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ తమిళనాట మాత్రం గట్టి పోటీ ఉండబోతుంది. ఎందుకంటే అదే సమయంలో అక్కడ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రిలీజ్ కాబోతుంది. అక్కడ అజిత్ కు ఎలాంటి క్రేజ్ ఉందొ తెలియనిది కాదు. సో అక్కడి ప్రేక్షకులు మొదట తమిళ సినిమాకే ప్రాధాన్యత ఇస్తారు.

అటు హిందీలో ప్రస్తుతానికి ఎలాంటి కాంపిటీషన్ లేదు. కానీ అక్కడ రామ్ చరణ్ మ్యానియా ఎంతవరకు ఉంది అనే దానిని బట్టి.. మూవీ వసూళ్లు డిపెండ్ అయ్యి ఉంటాయి. శంకర్ నుంచి వచ్చిన సినిమాలు గతకొన్నాళ్ళుగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. దీనితో పబ్లిక్ లో అతని సినిమాలపై క్రేజ్ తగ్గింది. సో ఇలా గేమ్ ఛేంజర్ కు ఎటు చూసినా ఆటంకాలు తప్పడం లేదు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ఇమేజ్ మారింది కాబట్టి.. ఈ సినిమా మీద కాస్తైనా హోప్స్ ఉన్నాయంటే అది చరణ్ వలనే. అభిమానులు మాత్రం ఈ సినిమాను ఎలా అయినా హిట్ చేయాలనీ చూస్తున్నారు. ఒక్కసారి పుష్ప హడావిడి అయితే అప్పుడు గేమ్ ఛేంజర్ అసలైన హడావిడి మొదలవుతుంది. ఇక ఈ ఆటంకాలన్నిటిని గేమ్ ఛేంజర్ అధిగమిస్తుందో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.