iDreamPost
android-app
ios-app

హీరో మరణం.. జీర్ణించుకోలేక నెల రోజుల్లోనే తల్లి కూడా..

హీరో మరణం.. జీర్ణించుకోలేక నెల రోజుల్లోనే తల్లి కూడా..

దేశానికి రాజైనా.. తల్లికి మాత్రం బిడ్డే. హీరోగా మారిన కొడుకును చూసుకుని మురిసిపోయిన తల్లి ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైంది. ఓ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమయ్యాడు కొడుకు . 30 ఏళ్లు అతడికి సపర్యలు చేసింది ఆ తల్లి. కాని గత నెల 19న తనను ఒంటరి చేసి కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లడిల్లి పోయింది తల్లి. అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. కొడుకు లేడని, ఇక రాడని తెలిసినా.. నిద్ర హారాలు మానేసి.. అతడినే తలచుకుంటూ జీవచ్ఛవంలా మారింది. చివరకు తీవ్ర అస్వస్థతకు గురై ఈ నెల 11న తుది శ్వాస విడిచింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ హీరో, అతడి తల్లి ఇద్దరూ మరణించారు. ఇంతకు ఆ హీరో ఎవరంటే.. తమిళ నటుడు బాబు. అతడి తల్లి పేరు ప్రేమ. ఆమె మరెవ్వరో కాదు తమిళనాడు మాజీ స్పీకర్ కె. రాజారాం సోదరి.

ప్రముఖ దర్శకుడు భారతీ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బాబు.. 1990లో వచ్చిన ‘ఎన్ ఉయిర్ తోజన్’ అనే మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత పెరుంపుల్లి, తాయమ్మ, పొన్నుకు చేతి వందచు’ చిత్రాల్లో నటించారు. మనసారా పరిహితంగా చిత్ర షూటింగ్ సమయంలో ఓ ఫైట్ తీసే సన్నివేశంలో.. ఎత్తులో నుండి నేలపై దూకాల్సి ఉండగా.. డూప్ పెట్టి చేయిద్దామని భావించారు దర్శకుడు. కానీ తానే చేస్తానని చెప్పడంతో జంప్ చేశారు. ఆ సమయంలో వెన్నుముక విరిగి మంచానికి పరిమితమయ్యారు. అప్పటికే పలు సినిమాలను ఒప్పుకున్నాడు. ఈ ప్రమాదం అతడి జీవితాన్ని తల్లకిందులు చేసింది. వెన్నుముక ఆపరేషన్ చేసినప్పటికీ.. నిటారుగా కూర్చోలేని, నిలబడలేని పరిస్థితి. దీంతో 30 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు బాబు. అన్నేళ్ల పాటు కుమారుడికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంది తల్లి. అతడు మరణించడంతో తట్టుకోలేక.. కుంగిపోయి ప్రాణాలు విడిచింది.