iDreamPost
android-app
ios-app

రవితేజ మెడకు ఏమైంది.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్!

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమా థియేటరల్లో సందడి చేయనుంది. ఇదిలా ఉంటే. ఆ మూవీ దర్శకుడు పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది.

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమా థియేటరల్లో సందడి చేయనుంది. ఇదిలా ఉంటే. ఆ మూవీ దర్శకుడు పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది.

రవితేజ మెడకు ఏమైంది.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్!

మాస్ మహారాజా రవితేజ తెలియని వారుండరు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, స్నేహితుడిగా ఎన్నో రోల్స్ చేసి.. ఆ తర్వాత హీరోగా మారాడు. సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. వెరీ డెడికేషన్ ఉన్న హీరో. టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ సమయంలో ఆయన గాయపడగా.. 10 కుట్లు పడితే.. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా.. ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడకూడదని వెంటనే చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఎంతో హుషారుగా కనిపించే ఈ ఎనర్జీ స్టార్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్నాడు. నామ్ తో సునా హోగా ఉపశీర్షిక. దీనికి హరీష్ శంకర్ డైరెక్టర్. కాగా, ఇప్పుడు అతడు పెట్టిన ఓ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ధమకా, ఈగల్ తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రాబోతున్న మూడవ చిత్రం బచ్చన్. పనోరామ స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ట సహ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయకి. సెప్టెంబర్‌లో మూవీ రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్.. హరీష్ శంకర్ చేసిన పోస్టు అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగించింది. ‘తీవ్రమైన మెడ నెప్పి ఉన్నా కూడా వర్క్ చేసిన నీ డెడికేషన్‌కు హ్యాట్ ఆఫ్. థాంక్యూ అన్నయ్య.. నువ్వు ప్రతి రోజు మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తావు’ అంటూ పోస్టు పెట్టాడు.

Raviteja injured

అందులో రవితేజ మెడకు బ్యాండ్ తగిలించుకుని కనిపించాడు. హరీష్ శంకర్ పక్కనే అదిమి పట్టుకొని కూర్చున్నాడు. అంత నొప్పి ఉన్నా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా చిత్రీకరణలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పోస్టు అభిమానుల్లో ఆందోళన, ఆసక్తిని రేకెత్తిచింది. రవితేజకు ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మెడ నొప్పికి కారణమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్న అని సలహా ఇచ్చేవాళ్లు కొందరైతే.. నీ డెడికేషన్‌కు హ్యాట్సాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. షూటింగ్ ఆపేస్తే నిర్మాతకు భారీ నష్టం వస్తుందని భావించి.. మెడ నొప్పి మెలిపెడుతున్నా.. అలాగే షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ట్వీట్ కనిపిచడం లేదు. కానీ అప్పటికే స్క్రీన్ షాట్స్ రూపంలో హల్చల్ చేస్తుంది.  ఈ సినిమాతో పాటు  మరో సినిమా షురూ చేశాడు రవి. అందులో శ్రీలీల కథానాయిక.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి