iDreamPost
android-app
ios-app

Hanuman OTT Records: OTT లో హనుమాన్ కొత్త రికార్డ్స్.. కేవలం11 గంటల్లోనే !

  • Published Mar 18, 2024 | 5:38 PM Updated Updated Mar 18, 2024 | 5:39 PM

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా వచ్చి మిగిలిన సినిమాలను ఓడించి.. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ మోత మోగించిన హనుమాన్ ఇప్పుడు ఓటీటీ లో కూడా తన సత్తా చూపిస్తోంది. ఏ అప్ డేట్ లేకుండా తెలుగు వెర్షన్ లో సడెన్ ఎంట్రీ ఇచ్చింది "హనుమాన్" సినిమా.

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా వచ్చి మిగిలిన సినిమాలను ఓడించి.. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ మోత మోగించిన హనుమాన్ ఇప్పుడు ఓటీటీ లో కూడా తన సత్తా చూపిస్తోంది. ఏ అప్ డేట్ లేకుండా తెలుగు వెర్షన్ లో సడెన్ ఎంట్రీ ఇచ్చింది "హనుమాన్" సినిమా.

  • Published Mar 18, 2024 | 5:38 PMUpdated Mar 18, 2024 | 5:39 PM
Hanuman OTT Records: OTT లో హనుమాన్ కొత్త రికార్డ్స్.. కేవలం11 గంటల్లోనే !

ఓటీటీలో ప్రతి వారం పదుల సంఖ్యలో తెలుగు సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. కానీ, తెలుగు ప్రేక్షకులంతా కూడా ఒక్క హనుమాన్ సినిమా కోసం ఎంతో ఎదురుచూశారు. ముందుగా మార్చి 8న హనుమాన్ ఓటీటీ ఎంట్రీ ఇస్తుందని ప్రకటించారు మేకర్స్. కానీ, అనుకున్న టైమ్ కి ఈ సినిమా ఓటీటీలోకి రాలేకపోయింది. దీనితో ఈ సినిమాపై అంతటా విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో హనుమాన్ హిందీ వెర్షన్ ను జియోసినిమాలో ముందుగా విడుదల చేశారు. ఇక హిందీ వెర్షన్ తర్వాత.. ఒక్క రోజులోనే ఎలాంటి అప్ డేట్ లేకుండా నేరుగా హనుమాన్ తెలుగు వెర్షన్ జీ5 ఓటీటీలో అడుగుపెట్టింది. దీనితో ఒక్కసారిగా జీ5 కు ఆదరణ బాగా పెరిగిపోయింది. థియేటర్ లో కాసుల వర్షం కురిపించి.. సునామి సృష్టించిన హనుమాన్.. ఓటీటీలోను తన సత్తా చూపిస్తూ దూసుకుపోతుంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక.. నిన్నటితో నెరవేరిపోయింది. ఎట్టకేలకు మార్చి 17 ఉదయం జీ5 ఓటీటీలో.. హనుమాన్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు.. భారీ వ్యూవర్‌షిప్ దక్కుతోంది. తొలి 11 గంటల్లోనే హనుమాన్ కు 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటిందని.. స్వయంగా జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హనుమాన్ సినిమా ఇప్పుడు గ్లోబల్ గా టాప్-1 లో ట్రెండింగ్ లో ఉందంటూ జీ 5 సంస్థ పేర్కొంది. “11 గంటల్లో 102 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ ను అధిగమించి రికార్డులను బద్దలుకొట్టింది” అంటూ ఓ పోస్ట్ ను రిలీజ్ చేసింది. కేవలం తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ.. రికార్డు స్థాయిలో ఇంత ఫాస్ట్ గా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను .. ఈ సినిమా దక్కిచుకోవడం చాలా ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనే స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్.. త్వరలో జీ5 ఓటీటీలో కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

hanuman creates new records in ott

 

ఓ వైపు ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వస్తున్నా కూడా వాటి అన్నిటిని తుడిచిపెట్టేసేలా.. అటు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన విధంగా.. ఓటీటీ లోను రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది హనుమాన్. సుమారు రూ.40కోట్ల బడ్జెట్‍తో రూపొందిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైన ఒక్క రోజులోనే ఈ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేసిందంటే.. రానున్న రోజుల్లో హనుమాన్ ఇంకెన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తోందో.. అందరు ఊహించగలరు. ఇక ఇప్పుడు అందరి ఎదురుచూపులు హనుమాన్ పార్ట్-2 కోసమే. ఇక, ఈసారి ప్రశాంత్ వర్మ ఎటువంటి మాయ చేస్తాడో వేచి చూడాలి. మరి, హనుమాన్ సినిమా ఓటీటీ రికార్డ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.