iDreamPost
android-app
ios-app

Hanuman Movie: హనుమాన్ బాక్సాఫీస్ ఊచకోత.. ఏకంగా 250 కోట్లు!

  • Published Jan 27, 2024 | 9:31 PM Updated Updated Jan 27, 2024 | 9:31 PM

హనుమాన్ మూవీ బాక్సాఫీస్ ఊచకోత ఇంకా తగ్గలేదు. రెండు వారాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకుని, మూడో వీక్ లోకి అడుగుపెట్టింది. 15 రోజుల్లో ఏకంగా..

హనుమాన్ మూవీ బాక్సాఫీస్ ఊచకోత ఇంకా తగ్గలేదు. రెండు వారాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకుని, మూడో వీక్ లోకి అడుగుపెట్టింది. 15 రోజుల్లో ఏకంగా..

Hanuman Movie: హనుమాన్ బాక్సాఫీస్ ఊచకోత.. ఏకంగా 250 కోట్లు!

‘హనుమాన్’ ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమ్రోగుతున్న పేరు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఉన్నాగానీ.. వసూళ్లలో ఏ మాత్రం తగ్గలేదు హనుమాన్. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 15 రోజుల్లో బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తూ.. రూ. 250 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

హనుమాన్, ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఈ రెండు పేర్లు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నప్పటికీ.. ఏ మాత్రం భయపడకుండా పండగ బరిలోకి దిగి ఘన విజయం సొంతం చేసుకున్నాడు హనుమాన్. ఇక ఈ మూవీ విడుదలై 15 రోజులు కావొస్తున్నా కలెక్షన్లలో ఎక్కడా తగ్గడం లేదు. 15వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 5.50 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. హిందీలో కూడా రూ. 40 కోట్లకు పైగా కొల్లగొట్టాడు హనుమాన్.

కాగా.. ఓవరాల్ గా చూసుకుంటే.. హనుమాన్ వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్లు రాబట్టాడని సమాచారం. అందులో రూ. 130 కోట్లకు పైగా షేర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తెలుగులో పెద్ద హీరోల సినిమాలు కాకుండా చిన్న హీరోల చిత్రాలు ఈ రేంజ్ లో వసూల్ చేయడం ఇదే మెుదటిసారి కావడం విశేషం. పెట్టిన పెట్టుబడికి ఐదింతలు రాబట్టి.. మరిన్ని కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. దీంతో హనుమాన్ తర్వాత వచ్చే జై హనుమాన్ మూవీపై భారీగా అంచనాలను పెంచేశాడు ప్రశాంత్ వర్మ. పైగా జై హనుమాన్ మూవీకి సంబంధించిన వర్క్ ను సైతం స్టార్ట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇదిలా ఉండగా.. ఈ వారంలో కూడా పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో హనుమాన్ మరిన్ని కలెక్షన్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో 300 కోట్ల క్లబ్ లో చేరేందుకు బయలుదేరాడు హనుమాన్. మరి హనుమాన్ ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.