గుప్పెడంత మనసు సీరియల్‌ రిషి వదిన బ్యాక్‌ గ్రౌండ్‌ తెలుసా?

Guppedantha Manasu Serial Actress : గుప్పెడంత మనసు సీరియల్‌ లో రిషి వదినగా, శైలేంద్ర భార‍్యగా, దేవయాని కొడలిగా ‍ప్రేక్షకులను అలరించిన ధరణి ఎవరు ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏమిటో తెలుసా?

Guppedantha Manasu Serial Actress : గుప్పెడంత మనసు సీరియల్‌ లో రిషి వదినగా, శైలేంద్ర భార‍్యగా, దేవయాని కొడలిగా ‍ప్రేక్షకులను అలరించిన ధరణి ఎవరు ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ట్రెండు తో పాటు ఆడియాన్స్ కూడా మారరు. అందుకే ఒకప్పుడు సీరియల్స్ అంటే బోరింగ్‌ అనుకునే వాళ్లే.. ఇప్పుడు ఒక్కరోజు సీరియల్స్‌ మిస్‌ అయితే కొంపలు ములిగిపోయినట్టుగా ఫీల్‌ అవుతున్నారు. అంతాలా ఆడియోన్స్‌ బుల్లితెర పై ప్రసారమయ్యే సీరియల్స్‌ ను అందులో నటించే యాక్టర్స్ ను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సీరియల్స్‌ లో అలరించే నటీ,నటులకు విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. సోషల్‌ మీడియాలో సైతం వీరిని ఆరాధించి, అభిమానించే ప్యాన్స్‌ ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ సీరియల్‌ నటి కూడా ఒకరు. మరీ ఆమె ఎవరో కాదు.. బుల్లితెర నటి సీతా మహలక్ష్మి.

ఈ పేరుతో కాస్త పరిచయం అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ, గుప్పెడం మనసు సీరియల్‌ రిషి వదినా ధరణి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఈ సీరియల్‌ నటి ఆ పాత్రలో ఒదిగిపోయిందని చెప్పవచ్చు. ఇక పేరకు తగ్గట్టుగానే లక్షణంగా, అందంగా ఉన్న సీతా మహలక్ష్మి తెలుగమ్మాయి కావడం విశేషం. అయితే సీరియల్‌ లో మొదట అమాయకంగా కనిపించే సీతా మహలక్ష్మి ఆ తర్వాత మాత్రం.. భర్త అత్తకు పక్కలో బళ్లెంలా గుచ్చే పాత్రలో భలే గమ్మత్తుగా అలరించింది. అయితే ఈ సీరియల్‌ కంటే ముందు సీతా మహలక్ష్మి చాలా సీరియల్స్‌ లో నటించింది. అందులో ఈటీవీలోని గోరింటాకు, అభిషేకం, గీత గోవిందం వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించింది. అలాగే ఎన్నో షార్ట్‌ ఫిల్మిస్‌ లో కూడా ఈ చిన్నది అలరించింది. కానీ, ఆ సీరియల్స్‌ తో రానీ క్రేజ్‌ గుప్పెడంత మనసు సీరియల్‌ వచ్చిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో కూడా ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ చిన్నది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇకపోతే సీతా మహలక్ష్మి సత్యం రాజు వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. రిసెంట్‌ గా ఆయనతో కలిసి దిగిన రోమాంటిక్‌ వీడియో, ఫోటోస్‌ ను కూడా షేర్‌ చేసింది. అయితే ఈ ఫోటోస్‌ చూసిన నెటిజన్స్‌ మీకు ళ్లైందా? ఎప్పుడూ.. అతనెవరు? మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని ఆమె ఫాలోవర్స్ ప్రశ్నలు వేయడంతో.. సీతా మహలక్ష్మి స్పందిస్తూ అవును.. సడెన్‌ గా అలా అయిపోయింది, కానీ పెళ్లికి ఎవరికి పిలవలేదంటూ క్లారిటీ ఇచ్చేసింది.

ఇకపోతే గుప్పడంత మనసు సీరియల్‌ విషయానికొస్తే.. ఈ సీరియల్‌ యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఆడియోన్స్‌ అని తేడా లేకుండా అందరికీ ఆల్‌ టైమ్‌ ఫెవరెట్‌ అనే చెప్పవచ్చు. నిజానికి రిషిధార సీరియల్‌ బుల్లితెరపై శుభం కార్డు పడిపోయిన ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో మిగిలిపోయిందనే చెప్పవచ్చు. ఇక అందులో నటించే యాక్టర్స్‌ కూడా తెలుగు ప్రేక్షకుల కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయారు. అంతలా ఈ సీరియల్‌ కు అందులో నటించే యాక్టర్స్‌ కు ప​​​​​్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయిపోయారు. మరీ, గుప్పెడంత మనసు సీరియల్‌ ధరణి అలియాస్‌ సీతా మహలక్ష్మి బ్యాక్‌ గ్రౌండ్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments