iDreamPost
android-app
ios-app

అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్.. కానీ మీడియాలో మాత్రం..

  • Published Nov 21, 2024 | 12:52 PM Updated Updated Nov 21, 2024 | 12:52 PM

Andrea Jaremiah: గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా తర్వాత నటిగా మారింది. తెలుగు, తమిళ, మలయాళంతో పాలు అనేక భాషల్లో నటించింది. గత కొంత కాలంగా ఆండ్రియా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది.

Andrea Jaremiah: గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా తర్వాత నటిగా మారింది. తెలుగు, తమిళ, మలయాళంతో పాలు అనేక భాషల్లో నటించింది. గత కొంత కాలంగా ఆండ్రియా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది.

  • Published Nov 21, 2024 | 12:52 PMUpdated Nov 21, 2024 | 12:52 PM
అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్.. కానీ మీడియాలో మాత్రం..

ప్రముఖ నటి-సింగర్ ఆండ్రియా జెరెమియా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా తర్వాత నటిగా మారింది. యుగానికి ఒక్కడు, తడాఖా తో పాటు ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్, సహాయ నటిగా నటించింది. ఆండ్రియా కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. అయితే ఆండ్రియా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కావడం వల్ల డిప్రేషన్ లోకి వెళ్లిందని రక రకాలు వార్తలు వినిపించాయి. తాను సినిమాలకు బ్రేక్ తీసుకోవడంపై స్పందించిన ఆండ్రియా ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు బయటపెట్టింది.

‘వడ చెన్నై’ మూవీ తర్వాత తనకు ఓ అరుదైన వ్యాధి ఉన్నట్లు బయటపడిందని చెప్పుకొచ్చింది ఆండ్రియా. ఆ వ్యాధి పేరు ఆటో ఇమ్యూన్ స్కిన్. ఈ వ్యాధికి గురైన వారి కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారుతాయని తెలిపింది. రాత్రికి రాత్రే శరీరంపై మచ్చలు ఏర్పడతాయని చెప్పింది. ఇప్పటి వరకు శరీరంలో ఎన్నో మచ్చలు ఏర్పడ్డాయి. అంతేకాదు తన కనురెప్పలు తెల్లగా మారాయని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ వ్యాధి నిర్మూలన కోసం ఆక్యుపంక్చర్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు ఆండ్రియా తెలిపింది. నా రక్త పరీక్షలన్నీ పరీక్షించగా అంతా నార్మల్ గా ఉందని డాక్టర్లు చెప్పారు.ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు.కాకపోతే మానసికంగా తీవ్ర ఆందోళనకు గురి కావడం వల్ల వచ్చిందని చెప్పుకొచ్చింది. తనకు రెస్ట్ కావాలి.. అలాగే ట్రిట్‌మెంట్ కోసం సమయం కావాలి. సినిమాలకు దూరం కావడానికి ఇదే కారణం. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కావడం వల్ల సినిమాలకు దూరమయినట్లు వస్తున్న వార్తలు అన్నీ ఫేక్.. వాటిని అస్సలు నమ్మకండి. నా శరీరంపై మచ్చలు వచ్చాయి.. కను రెప్పలు తెల్లగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో నేను సినిమాల్లో ఎలా నటించగలను అని నన్నునేనే ప్రశ్నించుకున్నాను. అందుకే నా వ్యాధి నయం అయ్యేవరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.

ఆండ్రియా ‘అన్న యమ్ రసూల్’ మూవీ ద్వారా మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత లోహం, లండన్ బ్రిడ్జ్, థోపిల్ జోప్పన్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పేద, టాలెంట్ ఉన్న కళాకారుల కోసం ది షో మస్ట్ గో ఆన్ (TSMGO ప్రొడక్షన్స్) నడిపిస్తుంది. ఇదిలా ఉంటే కొంత కాలంగా ఆండ్రియా ఆరోగ్యం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆండ్రియా త్వరగా కోలుకొని మళ్లీ వెండితెరపై కనిపించాలని అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. గత కొంత కాలంగా సినీ తారలు తమ వ్యక్తిగత విషయాలు, సమస్యలు సోషల్ మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. తాను మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత వెల్లడించింది.ఆ వ్యాధి కోసం ట్రీట్ మెంట్ తీసుకోవడం వల్ల కొంత కాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. తాను తీసుకుంటున్న ట్రీట్ మెంట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అభిమానులకు పంచుకుంది.