iDreamPost
android-app
ios-app

ఆదిపై ఇంద్రజ ఫైర్..నోటి దూల తగ్గించుకోవాలంటూ వార్నింగ్

  • Published Sep 03, 2024 | 8:31 AM Updated Updated Sep 03, 2024 | 8:57 AM

Sridevi Drama Company: ఎప్పటిలానే శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచి లెటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో జబర్ధస్త్ ఫేమ్ ఆదిపై నటి ఇంద్రజ సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.

Sridevi Drama Company: ఎప్పటిలానే శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచి లెటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో జబర్ధస్త్ ఫేమ్ ఆదిపై నటి ఇంద్రజ సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 03, 2024 | 8:31 AMUpdated Sep 03, 2024 | 8:57 AM
ఆదిపై ఇంద్రజ ఫైర్..నోటి దూల తగ్గించుకోవాలంటూ వార్నింగ్

వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రేక్షకులు సినిమాలైన ఆసక్తిగా చూస్తారమో తెలియదు కానీ, బుల్లితెర పై ప్రసారమైన పాపులార్ ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం అసలు మిస్ చేయకుండా చూస్తారు. అంతలా బుల్లితెరపై ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా ఈ షోలో ఆర్టిస్టులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ.. తమదైన డ్యాన్స్ లు, స్కిట్ లతో ఆడియోన్స్ ను వినోదంలో ముంచెత్తుంటారు. అలాగే ఈ షోలో జడ్జిగా వ్యవహారించిన ఇంద్రజ కూడా తనదైన స్టయిల్లో చేసే కామెడీ, డాన్స్, యాక్షన్ తో ఆకట్టుకుంటారు. ఇకపోతే ఈ షోకు యాంకర్ చేస్తున్న రష్మీ కూడా తనదైన అందం, యాంకరింగ్, డ్యాన్స్ లతో అందర్నీ అలరిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వీక్ ప్రోమో విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలానే ఈ వారంకు సంబంధించిన లెటెస్ట్ ప్రోమో కూడా రిలీజైంది. అయితే ఈ ప్రోమోలో జబర్ధస్త్ ఫేమ్ ఆదిపై నటి ఇంద్రజ సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం.

బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఈ సెప్టెంబర్ 8కి ప్రసారమయ్యే షో లెటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో ఎప్పటిలా కాకుండా.. ఈసారి కాస్త డిఫరంట్ ప్రారంభమవుతుంది. కాగా, ఈ ప్రోమోలో మొదటిగా గొప్ప గొప్ప యుద్ధలన్ని నా అనుకున్న వాళ్లతోనే అంటూ.. అత్త వర్సెస్ కోడళ్లు, చెల్లెలు వర్సెస్ కూతుళ్లు అంటూ ప్రారంభమవుతుంది. ఇందులో మొదటిగా.. జబర్ధస్త్ ఆది తన డ్యాన్స్ లతో ఎంట్రీ ఇస్తూ.. తనదైన డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అలాగే అతని ఎంట్రీ తర్వాత  ప్రముఖ సీరియల్ ఆర్టిస్టు భావనతో పాటు మరొక సీరియల్ నటి, జబర్ధస్త్ సత్యశ్రీ  ఎంట్రీ ఇస్తూ.. అంతా ఓ ఫ్యామిలీ డ్రామాగా స్కిట్ చేస్తూ.. తమదైన డైలాగ్స్ తో  ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇక ఆ తర్వాత.. ఈ షోలో మిగిలిన సీరియల్, జబర్ధస్త్ ఆర్టిస్టులు తో పాటు నటి ఇంద్రజ, యాంకర్ రష్మీ తో పాటు హీరో  రాజ్ తరుణ్, సుహాస్ కూడా ఎంట్రీ ఇస్తారు. అయితే  ఎప్పటిలానే ఈ షోలో ఆర్టిస్టులు తమదైన డ్యాన్స్ లు, స్కిట్స్ , టాస్క్ లతో అలరిస్తుంటారు. ఇలా సరదాగా సాగుతుండగా.. అంతలో ఆ షోలోజబర్ధస్త్ లేడీ ఆర్టిస్ట్ సత్యశ్రీ.. ‘ఫస్ట్ టైమ్ నేను మీకు చెల్లిగా  చేస్తున్న కదా ఆది గారు.. ఎలా ఉంది? అని అడిగారు’. ఇక ఆ ప్రశ్నకు ఆది బదిలిస్తూ.. ‘ఇప్పుడు దీని వల్ల ఏమి ఉపాయోగం అంటూ’ ప్రశ్నించారు.

అయితే ఆది చేసిన వ్యాఖ్యలకు ఇంద్రజ స్పందిస్తూ.. ”ఇప్పుడు మీరు ఇలా అడిగినందుకు ఏమి ఉపాయోగం ఉంది.. నోరు మూసుకోని నోటి దూల తగ్గించుకొని కూర్చుంటే మంచిది” అంటూ ఇంద్రజ ఆదికి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుంచి విడుదలైన  ఈ సీన్ హైలెట్ గా నిలివడమే కాకుండా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఎన్నాడు  లేని విధంగా ఇంద్రజ ఆదిపై ఇంతలా ఎందుకు సీరియస్ అయ్యారు అని నెట్టింట హాట్ టాఫిక్ గా మారింది. ఈ క్రమంలోనే కొంతమంది దీనిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే మరీ కొందరు మాత్రం ఇది షో మీద బజ్ కోసమే ఇలా చేశారంటూ కమెంట్స్ చేశారు. ఇకపోతే చివరిగా ఈ ప్రోమోలో సీరియల్ ఆర్టిస్ట్ భావన కొలుకత్త డాక్టర్ ఘటనకు సంబంధించి స్కిట్ చేసి అందర్నీ భావోద్వోగానికి గురి చేశారు. కాగా, ఈ స్కీట్ కు ఇంద్రజతో పాటు ఆది పలువురు కంటెస్టెంట్స్ కంటతడి పెట్టారు. మరీ ప్రస్తుతం ఆదిపై ఇంద్రజ సీరియస్ అవుతూ వార్నింగ్ ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Girişgrandpashabet giriş