Keerthi
జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కమిటీ నివేదికపై నటి రోహిణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కమిటీ నివేదికపై నటి రోహిణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Keerthi
జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ రిపోర్ట్ తో స్టార్ నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు గురించి ఒక్కొక్కరిగా బయటకు వచ్చి చెబుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో డైరెక్టర్,నిర్మాత,హీరో,నటుడు.. చివరికి అసిస్టెంట్స్ డైరెక్టర్ సైతం ఎవరెవరు తమపై ఎలా దాడులు చేశారు, ఎలా అసభ్యకరంగా మాట్లాడారో పలవురు సినీ తారలు ఆరోపణలు కూడా చేశారు. కాగా, ఇప్పటికే హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. 17 లైంగిక ఆరోపణ కేసులు వెలుగులోకి రాగా, అందులో ఇద్దరి నటులపై చట్టపరంగా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా ఈ కమిటీ ఇచ్చిన నివేదిక పై నటి రోహిణి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే.
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. తమకు ఎదురైన వేధింపుల గురించి నటీమణులు ధైర్యంగా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. అలాగే తాము ఎవరెవరి వాళ్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నమో మీడియా ఎదుట ధైర్యంగా తెలియజేస్తున్నారు. ఈ విషయం పైనే తాజగా నటి రోహిణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తమిళనాడులో నేడు (ఆదివారం) జరిగిన నడిగర్ సంఘం మీటింగ్‌లో ఆమె పాల్గొని.. హేమ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఆ విషయాల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని, అసలు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రోహిణి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆమె చేసినవ్యాఖ్యల్లో నిజం ఉందని, ధైర్యంగా మీడియాకు చెప్పిన బదులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడం బెటర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారు ? ఇండస్ట్రీలో ఎలాంటీ కీచకులు ఉన్నారు అనే దాని మీద పరిశోధన చేసి ఓ నివేదికను తయారు చేశారు జస్టిస్ హేమ కమిటీ. ఇక ఆ నివేదికను కేరళ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలు చూసి ప్రభుత్వం షాకైంది. ఎందుకంటే.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో డైరెక్టర్, నిర్మాత, హీరో, నటుడు .. చివరికి అసిస్టెంట్స్ సైతం మహిళలను లైంగికంగా ఎలా వేధిస్తున్నారో ఆ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. ఇక ఈ నివేదికపై కేరళ ప్రభుత్వం చాలా తీవ్రంగా మండిపడింది. అంతేకాకుండా.. పలువురు సెలబ్రిటీస్ సైతం ఈ నివేదికపై రకరకాలుగా స్పందించారు. మరీ,ప్రస్తుతం నటి రోహిణి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.