iDreamPost
android-app
ios-app

చెప్పుతో కొట్టేంతా ధైర్యం ఉందా..? విశాల్ పై రాధిక సంచలన వ్యాఖ్యలు

  • Published Sep 02, 2024 | 9:03 AM Updated Updated Sep 02, 2024 | 9:11 AM

Radhika SarathKumar: జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ రిపోర్ట్ పై స్పందించి హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి తాజాగా నటి రాధిక సంచలన వ్యాఖ్యలు చేశారు.

Radhika SarathKumar: జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ రిపోర్ట్ పై స్పందించి హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి తాజాగా నటి రాధిక సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published Sep 02, 2024 | 9:03 AMUpdated Sep 02, 2024 | 9:11 AM
చెప్పుతో కొట్టేంతా ధైర్యం ఉందా..? విశాల్ పై రాధిక సంచలన వ్యాఖ్యలు

సినీ పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఈ రిపోర్ట్ తో స్టార్ నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు గురించి బయటకు వచ్చి చెబుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో డైరెక్టర్,నిర్మాత,హీరో,నటుడు .. చివరికి అసిస్టెంట్స్ డైరెక్టర్ సైతం ఎవరెవరు తమపై ఎలా దాడులు చేశారు, ఎలా అసభ్యకరంగా మాట్లాడారో పలవురు సినీ తారలు ఆరోపణలు కూడా చేశారు. కాగా, ఇప్పటికే ఈ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. 17 కేసులు వెలుగులోకి రాగా, అందులో ఇద్దరి నటులపై చట్టపరంగా కేసు నమోదైంది.

దీంతో మలయాళీ ఇండస్ట్రీలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఒక్కొక్కరిగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇటీవలే స్టార్ హీరో మోహన్ లాల్ కూడా మూవీ అససియేషన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  ఇక ఈ వివాదంపై  మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు ఇండస్ట్రీల నుంచి సెలబ్రెటీలు పెద్ద ఎత్తునే  స్పందించి ఇంట్రెస్టంగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై కోలీవుడ్  హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలపై నటి  రాధికా శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నటి రాధిక శరత్ కుమార్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై స్పందించి హీరో విశాల్ చేసిన వ్యాాఖ్యలకు స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే విశాల్ మలయాళ ఇండస్ట్రీలో నటీమణులు అడ్జస్ట్ కాకుండా.. చెప్పుతో కొట్టాలి అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై స్పందిచిన రాధిక మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తులను చెప్పుతో కొడితే అంతా బాగుంటుందా? అలా చేస్తే ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఆలోచించరా అని రాధిక ప్రశ్నించారు.

ముఖ్యంగా నటీనటుల సంఘం నాయకుడిగా విశాల్ మాట్లాడి ఉండాల్సింది ఏంటి?  నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటా అనాలి కానీ, నటీమణులతో అనుచితంగా ప్రవర్తించే వారిని విశాల్ చెప్పులతో కొడతాడా? అసలు విశాల్‌ చెసిన వ్యాఖ్యల్లో అర్థం లేదు.  ఇది ఒక నాయకుడి ప్రసంగమా? నిజం మాట్లాడే ధైర్యం మహిళలందరికీ ఉండదు కదా. మీరు అందరు నటీనటులు, నిర్మాతలు కలిసి వచ్చి మాకు మద్దతు ఇవ్వండి. అప్పుడు అందరం కలిసి ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయించుకుందాం’ అంటూ రాధిక చెప్పుకొచ్చారు. మరీ, హీరో విశాల్ వ్యాఖ్యలను ఉద్దేశించి  రాధిక  చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.