iDreamPost
android-app
ios-app

Guntur Kaaram: అత్తారింటికి దారేది, అల వైకుంఠపురము రేంజ్ లో గుంటూరు కారం..

  • Published Jan 10, 2024 | 8:36 PM Updated Updated Jan 10, 2024 | 8:36 PM

గుంటూరు కారం మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు ప్రత్యేకంగా ఈ మూవీని ప్రదర్శించారు. వారు ఇచ్చిన రివ్యూలు చూస్తుంటే.. మహేష్ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

గుంటూరు కారం మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు ప్రత్యేకంగా ఈ మూవీని ప్రదర్శించారు. వారు ఇచ్చిన రివ్యూలు చూస్తుంటే.. మహేష్ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Guntur Kaaram: అత్తారింటికి దారేది, అల వైకుంఠపురము రేంజ్ లో గుంటూరు కారం..

‘గుంటూరు కారం’.. ప్రస్తుతం టాలీవుడ్ మెుత్తం ఈ మూవీ గురించే చర్చించుకుంటోంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ కావడంతో.. సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటూ సినిమా పండితులు చెప్పుకొస్తున్నారు. సుపర్ స్టార్ మహేష్ ఈ మూవీలో కొత్తగా కనిపించబోతున్నాడని టాక్. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. హీరోయిన్ శ్రీలీల మాస్ డ్యాన్స్, తమన్ అద్భుతమైన మ్యూజిక్ గుంటూరు కారానికి మరో అసెట్స్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు ప్రత్యేకంగా ఈ మూవీని ప్రదర్శించారు. వారు ఇచ్చిన రివ్యూలు చూస్తుంటే.. మహేష్ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ఆ కుర్చీ మడతపెట్టి’ అన్న సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దీంతో పాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

కాగా.. గుంటూరు కారం మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ రానే వచ్చింది. ఇండస్ట్రీలోని ప్రముఖులకు సినిమా రిలీజ్ ముందు సినిమా చూపించి, వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాను కూడా ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలకు చూపించారట. వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ చూస్తే.. ఈ సంక్రాంతికి మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడం ఖాయమే అంటున్నారు సినీ పండితులు. ఈ సినిమా చూసిన వారు అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాలను మించి ఉందని, ఇండస్ట్రీ హిట్ అవ్వడం గ్యారంటీ అంటూ తమ రివ్యూలను ఇచ్చారట.

ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ కెరీర్ లోనే అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. లేటెస్ట్ గా వస్తున్న గుంటూరు కారం ఆ మూవీల రికార్డులను బద్దలు కొడుతుందని సినిమా చూసిన పెద్దలు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం బయటకి తెలియడంతో.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. మరి మహేష్ ఏ రేంజ్ హిట్ కొడతాడని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.