iDreamPost
android-app
ios-app

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ మళ్లీ వెనక్కి! చరణ్ మూవీ ఇప్పట్లో లేనట్లేనా?

  • Published Jul 24, 2024 | 9:20 PMUpdated Jul 24, 2024 | 9:20 PM

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ కోసం ఆడియెన్స్ ఎంతో ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా రేంజ్​లో భారీ అంచనాలు ఉన్నాయి.

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ కోసం ఆడియెన్స్ ఎంతో ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా రేంజ్​లో భారీ అంచనాలు ఉన్నాయి.

  • Published Jul 24, 2024 | 9:20 PMUpdated Jul 24, 2024 | 9:20 PM
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ మళ్లీ వెనక్కి! చరణ్ మూవీ ఇప్పట్లో లేనట్లేనా?

మెగా పవర్ ​స్టార్ రామ్​ చరణ్​ను బిగ్ స్క్రీన్ మీద చూసి చాలా కాలమైంది. చివరగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన వెండితెరపై మెరిశారు. ఈ సినిమా విడుదలై దాదాపు రెండున్నరేళ్లు కావొస్తోంది. ఇంత గ్యాప్ వచ్చినా చరణ్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆయన మూవీ కోసం పాన్ ఇండియా లెవల్​లో విపరీతమైన బజ్ నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన అద్భుతమైన నటనను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. మరోమారు సిల్వర్​స్క్రీన్ మీద చరణ్ యాక్టింగ్ మ్యాజిక్​ను ఎంజాయ్ చేద్దామని ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ ఫిల్మ్​లో నటిస్తున్నారు చరణ్. ఈ సినిమా క్రిస్మస్​కు విడుదలవుతుందని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవలే అనౌన్స్ చేశారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘గేమ్ ఛేంజర్​’తో ఈపాటికే చరణ్ థియేటర్లలో సందడి చేసేవారు. కానీ డైరెక్టర్ శంకర్ ‘భారతీయుడు 2’తో పాటు ఏకకాలంలో ‘గేమ్ ఛేంజర్’ను తీయడంతో ఆలస్యమైంది. ‘భారతీయుడు’ సీక్వెల్ విడుదలవడంతో.. చరణ్ సినిమా పనుల్లో బిజీ అయిపోయారు శంకర్. నిర్మాత దిల్ రాజు క్రిస్మస్​కు వస్తున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పడంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. డిసెంబర్ 20న ‘గేమ్ ఛేంజర్’ను భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయని తెలుస్తోంది. ఈ తరుణంలో ‘గేమ్ ఛేంజర్’ పోస్ట్​పోన్ అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండటం అభిమానులను టెన్షన్ పెడుతోంది. ‘గేమ్ ఛేంజర్’ వస్తున్న క్రిస్మస్​ వీక్​కే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్​’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

చరణ్ మూవీ వల్ల నార్త్​లో తమకు థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉండటంతో ‘గేమ్ ఛేంజర్​’ను పోస్ట్​పోన్ చేయాంటూ మెగాస్టార్ చిరంజీవిని ఆమిర్ కోరారని టాలీవుడ్ సర్కిల్స్​లో వినిపిస్తోంది. ఇటు టాలీవుడ్​లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘తండేల్’ కూడా క్రిస్మస్ ఫెస్టివల్​నే టార్గెట్ చేస్తూ వస్తోంది. క్రిస్మస్ దాటితే సంక్రాంతి ఉంటుంది, ఆ పండక్కి అన్ని స్లాట్లు బుక్ అయిపోయాయి కాబట్టి తమ కోసం వెనక్కి తగ్గమని చరణ్​ను అరవింద్ కోరుతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఒకవేళ కాదని అదే తేదీకి విడుదల చేస్తే టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లో స్క్రీన్లు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్​’ లాభాల్లోకి వెళ్లాలంటే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టాలి. అది జరగాలంటే సోలో రిలీజ్ బెటర్ ఆప్షన్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఈ కారణాల రీత్యా చరణ్​ మూవీ రిలీజ్ పోస్ట్​పోన్ అవడం పక్కా అని రూమర్స్ వస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి