iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!

  • Published Dec 22, 2023 | 2:13 PM Updated Updated Dec 22, 2023 | 2:41 PM

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇండస్ట్రీకి చెందిన వారే కాదు.. ఇతర రంగాలత్లో ఇలాంటి వేధింపులతో ఎంతోమంది మహిళలు బాధపడుతున్నారు. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత పలువురు గతంలో తమకు జరిగిన అన్యాయాలపై సోషల్ మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇండస్ట్రీకి చెందిన వారే కాదు.. ఇతర రంగాలత్లో ఇలాంటి వేధింపులతో ఎంతోమంది మహిళలు బాధపడుతున్నారు. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత పలువురు గతంలో తమకు జరిగిన అన్యాయాలపై సోషల్ మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు.

స్టార్ హీరో విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!

ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజు కీ పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో పలువురు సినీ నటీమణులు, ఇతర రంగాలకు చెందిన వారు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు. ఇండస్ట్రీలో రాణించాలంటే.. పడక సుఖం అందించాలని కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారు డిమాండ్ చేయడంతో విభేదించి తమ కెరీర్ ని వదులుకున్నామని కొంతమంది నటీమణులు,జూనియర్ ఆర్టిస్ట్ లు ఆవేదన వ్యక్తం చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే కొంతమందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా స్టార్ హీరోపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో యాక్షన్ చిత్రాల్లో నటించే హీరోల్లో విన్ డీజిల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. డీజిల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. ఈయన నటించిన చిత్రాలు తెలుగు లో డబ్ అయ్యాయి. తాజాగా విన్ డిజిల్ పై కేసు నమోదు అయ్యింది. అతని మాజీ పర్సనల్ అసిస్టెంట్ జోనాసన్ సంచలన ఆరోపణలు చేశారు. 2010 లో ‘ఫాస్ట్ ఫైవ్’సినిమా చిత్రీకరణ సందర్భంగా హూటల్ గదిలో తన అనుమతి లేకుండా విన్ డిజిల్ ఓ సీన్ గురించి వివరిస్తూ గొడకు గట్టిగా అదిమిపెట్టి లైంగిక వేధింపులకు పాల్పపడినట్లు జొనాసన్ ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పపడ్డానిన అతని చెల్లెలికి చెప్పినా ఆమె కూడా నిర్లక్ష్యం వహించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి సోదరికి కాంప్లేంట్ చేసిందని అక్కసుతో డీ అంతేకాదు తనను కొద్ది గంటల్లోనే ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె కోర్టును ఆశ్రయించింది.

Allegations of sexual harassment against star hero Vin Diesel

తనకు జరిగిన అన్యాయంపై లాస్ ఏంజిల్స్ కోర్టులో కోర్టులో ఆమె తరుపు న్యాయవాది కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం జొనాసన్ తరుపు నుంచి మార్క్ సింక్లెయిర్ అనే లాయర్ వాదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విన్ డిజిల్ తనపై లైంగిక వేధింపులు చేసినందుకు ఆమె ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఆమె భవిష్యత్ గురించి ఏమీ ఆలోచించకుండా ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తొలగించారు. అంతేకాదు విన్ డిజిల్ తో పాటు అతని చెల్లెలు కూడా లైంగిక వేధింపులను దాచిపెట్టే యత్నం చేశారు. ఇలాంటి వారికి రక్షణ కల్పిస్తే.. అమాయకులపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పపడతారు.. వారి ఆగడాలు ఎప్పటికీ ఆగవు అన్నారు.