iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం

  • Published Oct 09, 2023 | 9:48 PM Updated Updated Oct 10, 2023 | 8:49 AM
  • Published Oct 09, 2023 | 9:48 PMUpdated Oct 10, 2023 | 8:49 AM
బ్రేకింగ్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి (86) సోమవారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. ఇదే విషయాన్ని దిల్ రాజు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. అయితే దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

ఇక పరిస్థితి విషమించడంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో దిల్ రాజు కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దిల్ రాజును పరామర్శిస్తున్నారు. ఇకపోతే, శ్యామ్ సుందర్ రెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లి గ్రామం. ఈయనకు దిల్ రాజుతో పాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, శ్యామ్ సుందర్ రెడ్డి పార్థీవ దేహాన్ని హైదరాబాద్​ ఎమ్మెల్యే ఎంపీ కాలనీలోని దిల్ రాజు ఇంటికి మంగళవారం తెల్లవారుజామున 6.30 గంటలకు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫిల్మ్​నగర్​లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలిసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet