iDreamPost
android-app
ios-app

వీడియో: కాలేజీ కంప్యూటర్ ల్యాబ్‏లో సలార్ క్రేజ్.. ఇది ప్రభాస్ రేంజ్!

  • Published Dec 22, 2023 | 4:59 PM Updated Updated Dec 22, 2023 | 4:59 PM

Salaar Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా సలార్ మూవీ విడుదల సందర్భంగా..డార్లిగ్ ఫ్యాన్స్ థియేటర్స్ లో దుమ్ములేపారు.

Salaar Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా సలార్ మూవీ విడుదల సందర్భంగా..డార్లిగ్ ఫ్యాన్స్ థియేటర్స్ లో దుమ్ములేపారు.

  • Published Dec 22, 2023 | 4:59 PMUpdated Dec 22, 2023 | 4:59 PM
వీడియో: కాలేజీ కంప్యూటర్ ల్యాబ్‏లో సలార్ క్రేజ్.. ఇది ప్రభాస్ రేంజ్!

ప్రేక్షకులకు సినిమాలపైన, నటీ నటులపైన ఉన్న అభిమానం చాల ప్రత్యేకమైనది. తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు.. వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా, సినిమా  విడుదలైందంటే దానిని ఒక పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటారు.  ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమాన హీరోపై తమకున్న ప్రేమను చాటుకుంటారు. అయితే,  ‘సలార్’ తో మరొక్కసారి.. డార్లింగ్ పేరు మోతమోగుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా అంతటా ప్రభాస్ నామ స్మరణనే జరుగుతోంది. అభిమానులందరూ ప్రభాస్ అభిమానులు వేరయా అన్నట్లు..  ప్రభాస్ సొంత ఊరైన భీమవరంలో ప్రత్యేకించి డార్లింగ్ ఫ్యాన్స్ చేస్తున్న సెలెబ్రేషన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ విడుదల సందర్బంగా..  అతని అభిమానులు అంతటా పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు. దానికి సంబంధించిన  పోస్ట్స్, వీడియోస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో భీమవరంలో ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వీరి ఆధ్వర్యంలో 1500 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సేవ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, తమ ఫేవరేట్ హీరోపై అభిమానం చూపించడంలో విద్యార్థుల తర్వాతనే ఎవరైనా.. అని భీమవరం కాలేజీ విద్యార్థులు మరోసారి నిరూపించారు.

భీమవరం విష్ణు, ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కువగా డార్లింగ్ అభిమానులు ఉన్నారు. సలార్ విడుదల సందర్భంగా  కాలేజీలోని కంప్యూటర్ ల్యాబ్స్ లో ఉన్న అన్ని కంప్యూటర్లలో.. ‘సలార్’ లోని ప్రభాస్ ఫోటోలను వాల్ పేపర్ గా పెట్టారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో ఇంకా ఆ వీడియోను ప్రభాస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. రెబెల్ స్టార్ పై విద్యార్థులకు ఉన్న అభిమానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరో వైపు, సలార్ సందడి సంధ్య థియేటర్ లో కన్నుల పండుగగా జరిగింది. గురువారం రాత్రి నుంచి ప్రీమియర్ షో రిలీజ్ అయ్యేవరకు .. మోషన్ పోస్టర్స్ తో, ప్రభాస్ కట్ ఔట్స్ తో ఆ ప్రాంగణం అంతా నింపేశారు. రాత్రంతా ప్రభాస్ సినిమా సాంగ్స్ తో ఫ్యాన్స్ పీక్స్ లో ఎంజాయ్ చేశారు. చెప్పాలంటే ఒక మినీ మ్యూజికల్ కాన్సెర్ట్ లా సెలెబ్రేట్ చేశారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను ఒక డిఫరెంట్ లుక్ లో చూపించి డార్లింగ్ క్రేజ్ ను ఇంకాస్త పెంచేశాడు. ప్రభాస్ కూడా ఎప్పటిలానే తన గ్రేస్ యాటిట్యూడ్ తో ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదు. ఏదేమైనా, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తమ అభిమాన హీరో చిత్రం అంటే ఫ్యాన్స్ ఈ మాత్రం హడావిడి చేయడం సహజం. దీనికి సంబంధించిన పోస్ట్స్ చూసిన నెటిజన్లు.. డార్లింగ్ పై ఉన్న అభిమానుల ప్రేమకు ఆశ్చర్యపోతున్నారు. మరి..  ప్రభాస్ అభిమానులు చేస్తున్న ‘సలార్’ సెలెబ్రేషన్స్ పై, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom