iDreamPost
android-app
ios-app

Akhil: హారర్ సినిమా దర్శకుడితో అఖిల్ సినిమా?

  • Published Feb 27, 2024 | 12:56 PM Updated Updated Feb 27, 2024 | 12:56 PM

అక్కినేని అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఒక హారర్ సినిమా దర్శకుడితో అఖిల్ కొత్త సినిమాను మొదలుపెడతారనే వార్త గట్టిగా వినబడుతుంది.

అక్కినేని అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఒక హారర్ సినిమా దర్శకుడితో అఖిల్ కొత్త సినిమాను మొదలుపెడతారనే వార్త గట్టిగా వినబడుతుంది.

  • Published Feb 27, 2024 | 12:56 PMUpdated Feb 27, 2024 | 12:56 PM
Akhil: హారర్ సినిమా దర్శకుడితో అఖిల్ సినిమా?

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావొస్తున్నా ఇంకా తన తదుపరి చిత్రం మొదలవలేదు. ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఏజెంట్ అటు అభిమానులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత అఖిల్ కొత్త సినిమా పుకార్లలో కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ అవి ఏవీ నిజం కాలేదు. ఇటీవల సలార్ సక్సెస్ పార్టీలో కొద్ది సేపు అఖిల్ సందడి చేస్తూ కనిపించడంతో అఖిల్ సలార్ సీక్వెల్ లో తను ఉంటారన్న రూమర్లు వచ్చాయి కానీ అది కూడా ఉట్టి పుకారుగానే మిగిలిపోయింది. అయితే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

‘ఏజెంట్’తో పరాజయం పాలైన అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడితో మొదలుపెట్టాల్సి ఉంది. యూవీ క్రీయేషన్స్ సంస్థతో అఖిల్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయాల్సి ఉండింది. అయితే బడ్జెట్ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని అన్నారు. ఇంతలో ఒక హారర్ సినిమా దర్శకుడితో అఖిల్ కొత్త సినిమాను మొదలుపెడతారనే వార్త గట్టిగా వినబడుతుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు మసూద ఫేమ్ సాయికిరణ్.

మసూద అనే హారర్ సినిమా 2022 నవంబరు 18న విడుదలయి సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, సంగీత ఈ సినిమాకు సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కామెడీ హారర్ సినిమాలు రాజ్యం ఏలుతున్న కాలంలో సీరియస్ హారర్ జానర్ లో సినిమా తీసి ప్రేక్షకులని మెప్పించారు సాయికిరణ్. ముఖ్యంగా ఫ్లాక్ బ్యాక్ లోని దెయ్యం సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారని ఆయనకు ప్రశంశలు లభించాయి. అయితే సాయికిరణ్ తో అఖిల్ చేసే సినిమా హారర్ ఆ కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ ఆసక్తికరమైన పుకారు నిజం అవ్వాలని కోరుకుందాం.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş