iDreamPost
android-app
ios-app

క్యూట్ లుక్స్‌లో కట్టిపడేస్తున్న ఈ స్టార్ హీరోయిన్‌ని గుర్తుపట్టారా..?

  • Published Dec 12, 2023 | 3:41 PM Updated Updated Dec 12, 2023 | 3:41 PM

ఇంటర్నెట్ ఓ అంతుచిక్కని అగాధమైతే.. సామాజిక మాధ్యమం.. ఓ మాయా ప్రపంచమే. ఎప్పుడు ఏవీ ట్రెండింగ్ లో ఉంటాయో తెలియదు. ఈ ఫోటో కూడా అలాంటిదే. ఈ ఫోటోలో క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?

ఇంటర్నెట్ ఓ అంతుచిక్కని అగాధమైతే.. సామాజిక మాధ్యమం.. ఓ మాయా ప్రపంచమే. ఎప్పుడు ఏవీ ట్రెండింగ్ లో ఉంటాయో తెలియదు. ఈ ఫోటో కూడా అలాంటిదే. ఈ ఫోటోలో క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?

  • Published Dec 12, 2023 | 3:41 PMUpdated Dec 12, 2023 | 3:41 PM
క్యూట్ లుక్స్‌లో కట్టిపడేస్తున్న ఈ స్టార్ హీరోయిన్‌ని గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా వచ్చాక.. ఏ సెలబ్రిటీ పిక్ ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. కొన్ని సార్లు త్వరగానే నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. మరికొన్ని సార్లు ఎప్పుడో గతంలో షేర్ చేసిన పిక్స్ హల్ చల్ చేస్తుంటాయి. ఇదిగో ఇప్పుడు ఈ పిక్ కూడా అంతర్జాలంలో షికార్లు చేస్తోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారా క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తుంది కదా. ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఈ అమ్మడు మాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్. ఇటు టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మలయాళ ముద్దుగుమ్మలంటే .. మన పరిశ్రమ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంటుంది అన్న సంగతి విదితమే.  తెలుగులో చేసినవీ కొన్ని సినిమాలే అయినప్పటికీ.. మంచి పాత్రల్లో మెప్పించింది. కానీ కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల మలయాళ పరిశ్రమకు దూరమై.. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది.

ఇంతకు ఆ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరంటే.. కార్తీక మీనన్ అలియాస్ భావన. ‘నీలపోరి గాజుల ఓ నీల వేణి.. నిలుచుండే కృష్ణవేణి’అంటూ మహాత్మ మూవీలో మనల్ని ఆకట్టుకున్న ఆ అమ్మాయే ఈ భావన. తెలుగులో చేసింది అడపాదడపా సినిమాలే అయిన బడా హీరోల పక్కనే చేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఆమె అత్యధిక సినిమాలు చేసింది. సుమారు 70 సినిమాలు చేసేసింది. మాలీవుడ్‌లో ఒకప్పుడు ఆమె టాప్ హీరోయిన్. కానీ ఒకే ఒక్క ఘటన ఆమె జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొని ఇంటికి వస్తుండగా.. ఆమెను కొంత మంది కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ హస్తం ఉందన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది కేరళలో. ఆ ఘటన తర్వాత ఆమె కన్నడ పరిశ్రమలో సినిమాలు చేస్తూ వస్తోంది. 2018లో ప్రముఖ కన్నడ ప్రొడ్యూసర్ నవీన్‌ను వివాహం చేసుకుంది. సుమారు ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మలయాళ ఇండస్ట్రీలో వరుస పెట్టి మూవీస్ చేస్తోంది అమ్మడు. తెలుగులో ముచ్చటగా మూడు సినిమాలు చేసింది భావన. గోపిచంద్‌తో ఒంటరి, నితిన్‌తో హీరో, శ్రీకాంత్‌తో మహాత్మ చిత్రాల్లో నటించింది. చేసింది 3 సినిమాలే అయినా.. టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు పలు మలయాళ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ మూవీ నటనపై అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Bhavana🧚🏻‍♀️Mrs.June6 (@bhavzmenon)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibomjojobet giriş