టీమిండియా క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అతడి స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ఇద్దరి జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు ఓ స్టార్ డైరెక్టర్.
టీమిండియా క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అతడి స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ఇద్దరి జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు ఓ స్టార్ డైరెక్టర్.
వెండితెరపైకి ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రలు వచ్చాయి.. వస్తున్నాయి కూడా. ఇక ఈ తరహా బయోపిక్ లు తెరకెక్కించాని కొందరు డైరెక్టర్లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే? టీమిండియా క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అతడి స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ఇద్దరి జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు ఓ స్టార్ డైరెక్టర్. ఈ విషయం స్వయంగా ఆయన చెప్పడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మరి ఆ డైరెక్టర్ ఎవరు?
వెండితెరపైకి సచిన్-వినోద్ కాంబ్లిలా జీవిత చరిత్ర రాబోతోంది. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు స్టార్ డైరెక్టర్ గౌతమ్ మేనన్. ప్రేమ కథలను మనసుకు హత్తుకునే విధంగా తెరకెక్కించడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచాడు గౌతమ్ మేనన్. తాజాగా ఆయన డైరెక్షన్ లో విక్రమ్ హీరోగా ‘ధ్రువ నక్షత్రం’ అనే సినిమా వస్తోంది. నవంబర్ 24 వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ. దీంతో వరుసగా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నారు గౌతమ్ మేనన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించిన వివరాలను వెల్లడించారు.
“నా నెక్ట్స్ మూవీ క్రికెట్ నేపథ్యంలో ఉండబోతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్, వినోద్ కాంబ్లిల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను, పాత్రను క్రియేట్ చేస్తున్నాను. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే ఇద్దరు ఫ్రెండ్స్ కథగా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నా” అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు గౌతమ్ మేనన్. స్టార్ డైరెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉండగా.. తొలుత ధ్రువ నక్షత్రం మూవీ కథను సూర్యకి వినిపించగా.. ఇలాంటి కథలు వర్కౌట్ అవుతాయా అని సందేహం వ్యక్తం చేశారని గౌతమ్ తెలిపాడు. ఆ తర్వాత ఇదే కథ సూపర్ స్టార్ రజినీకాంత్ కు వినిపించగా.. ఆయన ఒకే అన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. చివరిగా చియాన్ విక్రమ్ హీరోగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి సచిన్-కాంబ్లిలపై మూవీ రాబోతుండటం, పైగా దాన్ని గౌతమ్ మేనన్ లాంటి స్టార్ డైరెక్టర్ తీయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.