Swetha
Dhanush: చాలా మంది ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో సరిపెడుతూ ఉంటారు. కానీ ధనుష్ ఇలా ఒకేసారి పది ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పైగా అందులో రెండు బయో పిక్ లు కూడా ఉన్నాయి. ఇక ఇది కాకుండా ధనుష్ దర్శకుడిగా , నిర్మాతగా , హీరోగా చేస్తున్న 'ఇడ్లి కడాయి' మూవీ అక్టోబర్ 1న భారీ అంచనాల మధ్యన రిలీజ్ కానుంది.

ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా మార్కెట్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్న హీరో ధనుష్. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ధనుష్ ప్రతి సినిమాలోనూ.. తన మార్క్ ను సెట్ చేస్తూనే ఉన్నాడు. అటు హీరోగా ఇటు నిర్మాతగా , దర్శకుడిగా కూడా ధనుష్ తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. రీసెంట్ గా రాయన్ , జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలియనిది కాదు.
ఇక తెలుగులో సార్ మూవీ తర్వాత ధనుష్ చేస్తున్న మూవీ కుభేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నాగార్జున కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. జూన్ 20 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటు ధనుష్ మొత్తం పది ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. చాలా మంది ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో సరిపెడుతూ ఉంటారు. కానీ ధనుష్ ఇలా ఒకేసారి పది ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పైగా అందులో రెండు బయో పిక్ లు కూడా ఉన్నాయి. ఇక ఇది కాకుండా ధనుష్ దర్శకుడిగా , నిర్మాతగా , హీరోగా చేస్తున్న ‘ఇడ్లి కడాయి’ మూవీ అక్టోబర్ 1న భారీ అంచనాల మధ్యన రిలీజ్ కానుంది. ఇక హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న ‘తేరే ఇష్క్ మే. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్` , ఇక రీసెంట్ గా అనౌన్స్ చేసిన అబ్దుల్ కలామ్ బయో పిక్ , రాజ్ కుమార్ పెరియసామీతో ఓ సినిమా, విఘ్నేష్ రాజాతో ఓ ప్రాజెక్ట్, వెట్రిమారన్‌తో ఓ మూవీ, తమిళరసన్‌తో, మారి సెల్వరాజ్ సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ తో ధనుష్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.