iDreamPost
android-app
ios-app

NTR ముందు రెండు అతిపెద్ద టార్గెట్స్.. వీటిని దాటడం ఫ్యాన్స్​కు చాలా అవసరం!

  • Published Sep 12, 2024 | 9:58 AM Updated Updated Sep 12, 2024 | 10:24 AM

Devara Movie, Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ కోసం భారీ వెయిటింగ్ నడుస్తోంది. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Devara Movie, Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ కోసం భారీ వెయిటింగ్ నడుస్తోంది. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

  • Published Sep 12, 2024 | 9:58 AMUpdated Sep 12, 2024 | 10:24 AM
NTR ముందు రెండు అతిపెద్ద టార్గెట్స్.. వీటిని దాటడం ఫ్యాన్స్​కు చాలా అవసరం!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ కోసం భారీ వెయిటింగ్ నడుస్తోంది. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీ ఫ్యాన్స్ కూడా ఈ ఫిల్మ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఆడియెన్స్ పరిస్థితి ఇలా ఉంటే.. తారక్ అభిమానుల సిచ్యువేషన్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. తమ హీరోకు మరో బ్లాక్​బస్టర్ హిట్ పడాలని వాళ్లు కోరుకుంటున్నారు. అయితే జస్ట్ హిట్ కాదు.. అంతకుమించి ఎక్స్​పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ‘దేవర’తో హిట్టే కాదు.. తారక్ రీచ్ అవ్వాల్సిన టార్గెట్స్ భారీగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా రెండింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగులో ఎన్టీఆర్ రేంజ్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ వైడ్​గా కూడా ఆయన సత్తా అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతోనే. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఆయన పలికించిన మిక్స్​డ్ ఎమోషన్స్, ఆ రోల్​ను పండించిన తీరుకు అంతా ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ అందరికీ తెగ నచ్చేశాయి. బాలీవుడ్ టు హాలీవుడ్ వరకు ఆయన నటనకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’తో అంత పెద్ద హిట్ కొట్టినా తారక్ అభిమానుల్లో మాత్రం ఓ నిరాశ మిగిలిపోయింది. సోలో హీరోగా అన్ని భాషల్లో సత్తా చాటి ఉంటే చెప్పుకోవడానికి బాగుండేదనే అభిప్రాయం ఎన్టీఆర్ ఫ్యాన్స్​లో ఉంది. రామ్ చరణ్​తో కలసి తారక్ సత్తా చాటినా క్రెడిట్ ఇద్దరి హీరోల ఖాతాలో ఉంది.

సోలోగా ఎన్టీఆర్ అకౌంట్​లో ఒక పాన్ ఇండియా హిట్ ఉంటే బాగుంటుంది.. కాలర్ ఎగరేసుకోవచ్చు కదా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇది మొదటి టార్గెట్ అయితే తారక్ ముందు ఉన్న మరో బిగ్ టార్గెట్ రాజమౌళి హీరోలను వెంటాడుతున్న ఫ్లాప్ సెంటిమెంట్​ను బ్రేక్ చేయడం. జక్కన్నతో పనిచేసిన హీరోలు.. ఆయనతో మూవీ అయిపోయాక చేసిన నెక్స్ట్ ప్రాజెక్టులతో బిగ్ హిట్ కొట్టలేదు. హిట్ కాదు.. చాలా మంది హీరోలు ఫ్లాప్​లు ఫేస్ చేశారు.

తారక్ గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ రాజమౌళి తీసిందే. దీంతో ఇదే సెంటిమెంట్ ఎన్టీఆర్ విషయంలోనూ రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లాప్ సెంటిమెంట్​ను దాటడంతో పాటు సోలోగా పాన్ ఇండియా రేంజ్​లో బ్లాక్​బస్టర్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవే తారక్ మోయాల్సిన బరువైన బాధ్యతలు. ఇవే ఆయన ముందున్న అతిపెద్ద టార్గెట్స్. ఇది ఎన్టీఆర్ కంటే కూడా ఆయన ఫ్యాన్స్​కు ఎంతో అవసరం. తారక్ ఎలాగూ కొట్టేస్తాడు. ఆ విషయం ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. మరి.. ఎన్టీఆర్ ఆయన గోల్స్ రీచ్ అవుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetMadridbet