iDreamPost
android-app
ios-app

Pushpa 2: పుష్ప 2.. ఆ సినిమాల సెంటిమెంట్ నే ఫాలో అవుతున్న సుకుమార్!

  • Published Sep 11, 2024 | 3:06 PM Updated Updated Sep 11, 2024 | 3:06 PM

Pushpa 2 Latest Update: పుష్ప 2 విషయంలో ఆ రెండు సినిమాల సెంటిమెంట్ నే సుకుమార్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? ఆ సెంటిమెంట్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

Pushpa 2 Latest Update: పుష్ప 2 విషయంలో ఆ రెండు సినిమాల సెంటిమెంట్ నే సుకుమార్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? ఆ సెంటిమెంట్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

  • Published Sep 11, 2024 | 3:06 PMUpdated Sep 11, 2024 | 3:06 PM
Pushpa 2: పుష్ప 2.. ఆ సినిమాల సెంటిమెంట్ నే ఫాలో అవుతున్న సుకుమార్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2. ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ మధ్యలో కొంత గ్యాప్ రావడంతో.. షూటింగ్ కాస్త మరింత ఆలస్యం అయ్యింది. అయితే పుష్ప 2 కు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంటుంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఆ రెండు సినిమాల సెంటిమెంట్ నే సుకుమార్ ఫాలో అవుతున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి? ఆ సినిమాలు ఏవి?

సుకుమార్.. టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. పెద్ద సన్నివేశాన్ని ఎలా డీటైల్డ్ గా తీస్తాడో.. అలాగే చిన్న సన్నివేశాన్ని కూడా తీస్తాడు. ప్రస్తుతం పుష్ప 2ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక ఈ మూవీ రన్ టైమ్ గురించిన విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. పుష్ప 2 కూడా ఎక్కువ రన్ టైమ్ ఉన్న సినిమాగానే తెలుస్తోంది. ఈ చిత్రం కూడా దాదాపు 3 గంటల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. దాంతో ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాల సెంటిమెంట్ నే ఈ మూవీకి కూడా సుక్కు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు దాదాపు 3 గంటల రన్ టైమ్ ను కలిగి ఉన్నాయి. అవి రెండు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో లెంత్ విషయంలో సుకుమార్ కు ఎలాంటి టెన్షన్ లేదు.

ఇక పుష్ప 2 షూటింగ్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్ షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. సెకండాఫ్ లో ఒక సాంగ్ తో పాటుగా 20 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ మెుదటి వారంలో షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉంది. ఫహద్ ఫాజిల్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉంది. యానంలో ఓ షెడ్యూల్ ఉన్నట్లు సమాచారం. దాంతోనే పుష్ప 2 టాకీ, యాక్షన్ పార్ట్ లు పూర్తి అవుతాయి. వీటన్నిటితో పాటుగా ఓ ఐటెం సాంగ్ ను కూడా బాకీ ఉంది. సాంగ్ రెడీగా ఉన్నప్పటికీ.. బ్యూటీ ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదు. దాంతో ఈ సాంగ్ ఇంకా  షూట్ చేయలేదు. కాగా.. డిసెంబర్ 6న పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మరి రంగస్థలం, పుష్ప మాదిరే ఈ చిత్రం కూడా దాదాపు 3 గంటల రన్ టైమ్ ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş