iDreamPost
android-app
ios-app

Devara: USAలో ఆగని దేవర రికార్డులు.. తాజాగా మరో సూపర్ రికార్డ్!

  • Published Sep 12, 2024 | 3:13 PM Updated Updated Sep 12, 2024 | 5:25 PM

Devara: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో దేవర సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో విడుదల కాబోతుంది.

Devara: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో దేవర సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో విడుదల కాబోతుంది.

Devara: USAలో ఆగని దేవర రికార్డులు.. తాజాగా మరో సూపర్ రికార్డ్!

పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో దేవర సినిమాతో రాబోతున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఆకట్టుకుంది. సాంగ్స్ వైరల్ అయ్యాయి. ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. పైగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కచ్చితంగా అభిమానులు కాలర్ ఎగరేసే సినిమాగా నిలుస్తుందని చెప్పారు. లాస్ట్ నలభై నిమిషాలు ఒక రేంజిలో ఉంటుందని హైప్ ఇచ్చారు. దీంతో ఈ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని మించిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది.

దేవర అడ్వాన్స్ బుకింగ్స్ రోజు రోజుకి రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓవర్ సీస్ లోని నార్త్ అమెరికాలో కొత్త రికార్డులు నమోదు చేస్తుంది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ చూసుకున్నట్లైతే 408 లోకేషన్లలో 1197 షోలకు గాను 1,04300 మిలియన్ దాకా డాలర్లని కొల్లగొట్టింది దేవర. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇక టికెట్స్ చూసుకున్నట్లైతే రికార్డు స్థాయిలో 36 వేల దాకా బుక్ అయ్యాయని సమాచారం తెలుస్తుంది. విడుదలకు ఇంకా రెండు వారాల ముందే ఇలాంటి రికార్డులు సృష్టించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక విడుదల అయ్యి పాజిటివ్ టాక్ వస్తే కనుక ఈ సినిమా ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం ఖాయంగా అనిపిస్తుంది.

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న దేవర U/A సర్టిఫికేట్ అందుకుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 57 నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి అనిరుద్ రవి చందర్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక విడుదలకు ముందే నార్త్ అమెరికాలో రికార్డులు సృష్టిస్తున్న దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.