Arjun Suravaram
Deadpool Wolverine Movie Collection: థియేటర్లలోకి ఎన్నో మూవీలు వచ్చిన కొన్ని మాత్రం సందడి చేస్తుంటాయి. మరికొన్ని బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంటాయి. తాజాగా ఓ హాలీవుడ్ సూపర్ హీరో మూవీ కేవలం మూడు రోజుల్లోనే 3650 కోట్లు రాబట్టింది.
Deadpool Wolverine Movie Collection: థియేటర్లలోకి ఎన్నో మూవీలు వచ్చిన కొన్ని మాత్రం సందడి చేస్తుంటాయి. మరికొన్ని బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంటాయి. తాజాగా ఓ హాలీవుడ్ సూపర్ హీరో మూవీ కేవలం మూడు రోజుల్లోనే 3650 కోట్లు రాబట్టింది.
Arjun Suravaram
థియేటర్లలో ఎన్నో సినిమాలు సందడి చేస్తుంటాయి. కొన్ని అలా వచ్చి ఇలా వెళ్లాగా, మరికొన్ని మాత్రం బాక్సాఫీస్ పై దండయాత్ర సాగిస్తుంటాయి. ఇటీవల కాలంలో కొన్ని కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోన్నాయి. వసూళ్లలో దూసుకెళ్తో అనేక రికార్డులను క్రియేట్ చేస్తోన్నాయి. అలానే తాజాగా ఓ హలీవుడ్ సూపర్ హీరో సినిమా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లోనే 3650కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం…
హాలీవుడ్ నుంచి ఎన్నో క్రేజీ సినిమాలు వస్తుంటాయి. అలానే భారీ అంచనాల మధ్య హాలీవుడ్ సూపర్ హీరో మీవీ డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ సినిమా జూలై 26న ప్రపంచవ వ్యాప్తంగా విడులైంది. ఇక తొలి షో నుంచి ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో కుమ్మేస్తోంది. ఇప్పటికే కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 3650కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఈ సినిమా ఎనిమిదో స్థానంలో నిలిచింది.
మార్వెల్ స్టూడియోస్ డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్ మూవీని నిర్మించింది. రయాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్ మన్ హీరోలుగా నటించగా షాన్ లేవీ దర్శకత్వం వహించాడు. దాదాపు 200 మిలియన్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా మేకర్స్‌కు రెండింతల లాభాలను తెచ్చిపెట్టింది. డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్ రయాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ యాక్షన్ ఎపిసోడ్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోన్నాయి.
ఇక కథ విషయానికి వస్తే.. గర్ల్‌ఫ్రెండ్ వెనెసాతో బ్రేకప్ చెప్పిన డెడ్‌పుల్ కార్ల సేల్స్ మెన్‌గా తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. డెడ్‌పుల్ ను పారాడాక్స్ మనుషులు కిడ్నాప్ చేస్తారు. ఎర్త్ 616లో జాయిన్ కావాలని అతడిని బెదిరిస్తారు. ఈ క్రమంలోనే డెడ్‌పుల్‌ను వాల్వరిన్‌ను ఎలా కలిశాడు? పారాడాక్స్ నుంచి టెమ్ ప్యాడ్‌ను డెడ్‌పుల్ ఎందుకు చోరీ చేశాడు? మల్టీవెర్స్‌లో డెడ్‌పుల్, వాల్వరిన్ కలిసి ఎలాంటి సాహసాలు చేశారన్నదే ఈ మూవీ కథ. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసింది. ఈ యూనివర్స్ నుంచి ఇప్పటికే అనేక సినిమాలు రాగా.. తాజాగా డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డెడ్‌పుల్, డెడ్‌పుల్ 2 సినిమాలకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా జూలై 26వ తేదీన విడుదలైంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే 3650 కోట్లను వసూలు చేసింది. ఇక ఇండియాలో చూసినట్లు అయితే.. ఇక్కడ కూడా భారీగానే వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లో 66 కోట్ల వసూలును రాబట్టింది. ఈ సినిమా వీకెండ్ రోజులైన శని, ఆదివారాల్లో కలిసి దాదాపు 45 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. భారత్ లో ఈసినిమా హిందీతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో రిలీజైంది. మరి.. ఈ మూవీ కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.